News April 10, 2025

15న చిత్తూరు ఐటీఐలో అప్రెంటిస్ మేళా

image

చిత్తూరు ఐటీఐలో ఈనెల 15న అప్రెంటిస్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ రవీంద్రారెడ్డి తెలిపారు. ప్రముఖ కంపెనీలో అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేసేందుకు మేళా ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐల్లో చదివిన విద్యార్థులు అర్హులని చెప్పారు. ఐబీఎం ఓచర్లో నమోదు చేసుకోవాలన్నారు. 

Similar News

News April 25, 2025

కాణిపాకంలో సెక్యూరిటీ కట్టుదిట్టం

image

ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో కాణిపాకంలో సెక్యూరిటీ కట్టుదిట్ట చేశారు. భక్తుల బ్యాగులను సిబ్బంది క్షుణంగా తనిఖీ చేశారు. అనుమానం వచ్చిన భక్తుల గురించి వివరాలు ఆరా తీశారు. కాణిపాకంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

News April 24, 2025

చిత్తూరు: ఇంటర్ ఫస్ట్ ఇయర్‌కు కొత్త సిలబస్

image

2025-26 అకాడమిక్ ఇయర్ నుంచి ఇంటర్మీడియట్ ఫస్టియర్‌కు నూతన సిలబస్‌ను ప్రవేశపెడుతున్నట్లు DIEO శ్రీనివాస్ గురువారం తెలిపారు. కన్నన్ కళాశాలలో అధ్యాపకులకు దీనిపై ఓరియంటేషన్ తరగతులు ప్రారంభించామన్నారు. ప్రతి ఒక్క అధ్యాపకుడు ఈ తరగతులకు హాజరై నూతన సిలబస్‌పైన అవగాహన పెంచుకోవాలన్నారు. కళాశాల పునఃప్రారంభం నాటికి నూతన పుస్తకాలు అందుబాటులోకి తెస్తామన్నారు.

News April 24, 2025

వైసీపీ సర్పంచ్‌పై హత్యాయత్నం:రోజా

image

విజయపురం(మ) ఎం.అగరంలో వైసీపీ సర్పంచ్ సుధాకర్‌పై హత్యాయత్నం జరిగిందని మాజీ మంత్రి రోజా ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులు ఇప్పటికీ నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె ‘X’ వేదికగా మండిపడ్డారు. వెంటనే అసలు నిందితులను అరెస్ట్ చేయకపోతే ప్రైవేట్ కేసు వేసి న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. ప్రజా ప్రతినిధులపైనే దాడులు జరుగుతుంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ఆమె ప్రశ్నించారు.

error: Content is protected !!