News April 11, 2024

15న రాజాంకు చంద్రబాబు

image

టీడీపీ అధినేత చంద్రబాబు ఈనెల 15న రాజాం వస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకు పురపాలక సంఘం పరిధిలోని అంబేడ్కర్ కూడలి వద్ద బహిరంగ సభ ఉంటుందని రాజాం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోండ్రు మురళీమోహన్ బుధవారం రాత్రి తెలిపారు. సభకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు కూడా అధికంగా హాజరవుతారని చెప్పారు.

Similar News

News April 23, 2025

SKLM: క్రైమ్ రివ్యూ సమావేశం నిర్వహించిన DIG

image

విశాఖపట్నం రేంజ్ పరిధిలో గల జిల్లాల ఎస్పీలతో DIG గోపినాథ్ జెట్టి క్రైమ్ రివ్యూ సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశంలో శ్రీకాకుళం జిల్లా ఎస్పీ మహేశ్వరరెడ్డి పాల్గొన్నారు. దీనిలో భాగంగా గోపినాథ్ జెట్టి మాట్లాడుతూ.. గంజాయి రవాణాపై నియంత్రణ కోసం చెక్‌పోస్ట్‌ల వద్ద నిఘా ఏర్పాటు చేసి విస్తృత తనిఖీలు నిర్వహించాలన్నారు.

News April 22, 2025

శ్రీకాకుళం: అమ్మా నేనొస్తున్నా అంటూనే..!

image

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం లొద్దపుట్టి RH కాలనీలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన నెయ్యల గోపాల్ తగరపువలసలోని అవంతి ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్నాడు. ‘అమ్మా.. నేను ఇంటికి వస్తున్నా’ అంటూ తల్లికి కాల్ చేశాడు. ఎంతకీ ఇంటికి రాకపోవడంతో కాలేజీలో సంప్రదించారు. విజయనగరం రైల్వే స్టేషన్ పరిసరాల్లో గోపాల్ అనుమానాస్పదంగా చనిపోయాడని కాలేజీ ప్రతినిధులు తల్లికి చెప్పడంతో బోరున విలపించారు.

News April 22, 2025

సివిల్ సర్వీసులో మెరిసిన చిక్కోల్ యువకుడు

image

కోటబొమ్మాలి మండలం చలమయ్యపేటకు చెందిన లింగుడు జోష్ సివిల్ సర్వీస్‌ పరీక్షల్లో సత్తా చాటారు. మంగళవారం విడుదలైన సివిల్ సర్వీస్ ఫలితాల్లో 790 ర్యాంక్ సాధించాడు. ఇతని తండ్రి బాలయ్య మాజీ సైనిక ఉద్యోగి, తల్లి రాజ్యలక్ష్మి. దీంతో జోష్‌ను పలువురు అభినందించారు.

error: Content is protected !!