News June 4, 2024
15వ రౌండ్: చీపురుపల్లిలో టీడీపీ హవా

చీపురుపల్లి నియోజకవర్గానికి సంబంధించి 19 రౌండ్లు ఉండగా 15 రౌండ్ల లెక్క ముగిసింది. ఇప్పటి వరకు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కళా వెంకట్రావుకు 70,000 ఓట్లు రాగా.. వైసీపీ నుంచి బొత్స సత్యనారాయణకి 60,084 ఓట్లు పడ్డాయి. దీంతో బొత్స 9,916 ఓట్లతో వెనుకంజలో ఉన్నారు.
Similar News
News January 9, 2026
VZM: ‘పీహెచ్సీల్లో వైద్యసేవలు మెరుగుపడాలి’

విజయనరం జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యసేవలను మెరుగుపరిచి ఓపిని పెంచాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆయా శాఖాధికారులను ఆదేశించారు. పీహెచ్సీ వైద్య సేవలపై కలెక్టర్ కార్యాలయం నుంచి శుకవ్రారం వీడియో కాన్ఫరెన్స్తో సమీక్షించారు. ఐవీఆర్ఎస్ ఫీడ్బ్యాక్ సర్వేపైనా చర్చించారు. పీహెచ్సీల వైద్యసేవలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓపిని రోజుకి 50కి పెంచాలని ఆదేశించారు.
News January 8, 2026
నేరాల నియంత్రణకు సాంకేతికతను వినియోగించండి: SP

జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం నేర సమీక్షను నిర్వహించారు. నేరాల నియంత్రణకు సాంకేతికతను విస్తృతంగా వినియోగించాలని ఎస్పీ దామోదర్ అధికారులను ఆదేశించారు. అన్ని కేసుల్లో ఈ-సాక్ష్య యాప్ వినియోగం, సీసీటీఎన్ఎస్లో వివరాల అప్లోడ్ తప్పనిసరి అన్నారు. ఎన్బీడబ్ల్యూ అమలు, గంజాయి అక్రమ రవాణా నియంత్రణ, సైబర్ నేరాలపై దృష్టి పెట్టాలన్నారు.
News January 8, 2026
వెట్టిచాకిరీ పూర్తిగా నిర్మూలించాలి: VZM కలెక్టర్

విజయనగరం జిల్లాలో ఎక్కడా.. ఏ రూపంలోనూ వెట్టిచాకిరీ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. జిల్లా స్థాయి వెట్టిచాకిరీ నిఘా, పర్యవేక్షణ కమిటీ తొలి సమావేశం బుధవారం జరిగింది. పిల్లలు, గిరిజనులు, వ్యవసాయ కూలీలతో వెట్టిచాకిరీకి తావులేకుండా నిఘా పెంచాలని ఆయన సూచించారు. వెట్టి నుంచి విముక్తి చేసిన వారికి బ్యాంకులు, DRDA ద్వారా ఆర్థిక సహాయం అందించి జీవనాధారం కల్పించాలన్నారు.


