News April 10, 2025

15న చిత్తూరు ఐటీఐలో అప్రెంటిస్ మేళా

image

చిత్తూరు ఐటీఐలో ఈనెల 15న అప్రెంటిస్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ రవీంద్రారెడ్డి తెలిపారు. ప్రముఖ కంపెనీలో అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేసేందుకు మేళా ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐల్లో చదివిన విద్యార్థులు అర్హులని చెప్పారు. ఐబీఎం ఓచర్లో నమోదు చేసుకోవాలన్నారు. 

Similar News

News April 18, 2025

చిత్తూరు: ఆర్టీసీ షాపులకు టెండర్లు

image

చిత్తూరు జిల్లాలోని ఆర్టీసీ పరిధిలో ఉన్న వివిధ షాపుల నిర్వహణకు టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు డీపీటీవో జితేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. ఆసక్తి ఉన్నవారు ఈనెల 24వ తేదీ లోపు ఆయా డిపోల పరిధిలో టెండర్లు దాఖలు చేయాల్సి ఉంటుందన్నారు. చిత్తూరులోని ఆర్టీసీ బస్టాండ్‌ డీపీటీవో కార్యాలయంలో 25వ తేదీ టెండర్ల ప్రక్రియ జరుగుతుందన్నారు.

News April 18, 2025

తిరుమలలో కారు దగ్ధం.. భక్తులు సురక్షితం

image

తిరుమలలో ప్రమాదం తప్పింది. ఒంగోలుకు చెందిన భక్తులు కారులో తిరుమలకు వచ్చారు. కొండపై ఉన్న కౌస్తుభం పార్కింగ్ ప్రాంతంలో నిలిపారు. కారులో అకస్మాత్తుగా పొగలు రావడంతో వెంటనే భక్తులు దిగేశారు. తర్వాత కొద్దిసేపటికే కారులో మంటలు చెలరేగాయి. వాహనం మొత్తం కాలిపోయింది. అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

News April 18, 2025

చిత్తూరు జిల్లా టీచర్లకు గమనిక 

image

జిల్లాలోని అన్ని యాజమాన్యాల ప్రాథమిక, ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాల స్కూల్ అసిస్టెంట్‌లకు హెచ్ఎంలుగా ప్రమోషన్ ఇవ్వనున్నారు. సంబంధిత మెరిట్ సీనియార్టీ జాబితాను విడుదల చేసినట్లు  డీఈవో వరలక్ష్మి తెలిపారు. అభ్యంతరాలు ఉంటే 20వ తేదీ సాయంత్రం 6 గంటలలోపు తన కార్యాలయంలో తెలియజేయాలని కోరారు. సెలవు దినాల్లోనూ అభ్యంతరాలు స్వీకరిస్తామన్నారు.  

error: Content is protected !!