News December 13, 2025
15న జరగాల్సిన PGRS కార్యక్రమం రద్దు: ఇలక్కియా

భవానీ దీక్షల విరమణ విధుల్లో జిల్లా అధికారులు నిమగ్నమై ఉన్నందున ఈ నెల 15న జరగాల్సిన జిల్లాస్థాయి PGRS కార్యక్రమం రద్దు చేసినట్లు జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ ఇలక్కియా తెలిపారు. తదుపరి సోమవారం నుంచి PGRS యథావిధిగా కొనసాగుతుందని తెలిపారు. ప్రజలు తమ అర్జీలను Meekosam.ap.gov.inలో నమోదు చేసుకోవచ్చని, వివరాల కోసం 1100కు కాల్ చేయవచ్చని పేర్కొన్నారు.
Similar News
News December 14, 2025
NGKL: 23.06 శాతం పోలింగ్ నమోదు.

రెండవ విడత సర్పంచ్ ఎన్నికల్లో జిల్లావ్యాప్తంగా ఏడు మండలాల్లో ఉదయం 9:00 సమయానికి 23.06 శాతం పోలింగ్ నమోదు అయినట్టు ఎలక్షన్ అధికారులు వెల్లడించారు. 100% పోలింగ్ అయ్యే అవకాశం ఉందని గ్రామస్తులు ఓటర్లు తెలుపుతున్నారు. ఓటు వినియోగించుకునేందుకు యువత మరియు గ్రామస్తులు తరలివస్తున్నారు.
News December 14, 2025
వారంలో రూ.14,100 పెరిగిన వెండి ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల హవా కొనసాగుతోంది. ఈ వారంలో(DEC 7-13) 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.3,760 పెరిగి రూ.1,33,910కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.3,450 పెరగడంతో రూ.1,22,750గా ఉంది. ఇక కేజీ వెండి ధర రికార్డు స్థాయిలో రూ.14,100 పెరిగి రూ.2,10,000కు చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే రేట్లు ఉన్నాయి.
News December 14, 2025
మహిళల కోసం 10 కాపీ షాపులు: DRDA పీడీ

మహిళలు స్వయం ఉపాధితో పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని DRDA పీడీ ఝాన్సీరాణి పిలుపునిచ్చారు. వారి ఆర్థిక సాధికారతే లక్ష్యంగా జిల్లాలో మొత్తం 10 కాఫీ షాపులు ఏర్పాటు చేయనున్నట్లు ఆమె తెలిపారు. ఇప్పటివరకు ఆరుగురు మహిళలు దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. నరసరావుపేటలో కలెక్టరేట్, ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో కాఫీ షాప్ పనులు వేగంగా జరుగుతున్నాయని, వచ్చే నెలాఖరుకు వాటిని పూర్తి చేస్తామని ఆమె వివరించారు.


