News December 13, 2025
15న రవీంద్రభారతిలో బాలు విగ్రహావిష్కరణ

TG: ఈ నెల 15న రవీంద్రభారతిలో ది మ్యూజిక్ గ్రూప్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో SP బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని CM రేవంత్, మాజీ VP వెంకయ్య ఆవిష్కరించనున్నారు. అదేరోజు 4PMకు సినీ సంగీత స్వరనీరాజనం ఉంటుందని సంస్థ అధ్యక్షుడు అచ్యుత రామరాజు తెలిపారు. ఎంట్రీ పాసుల కోసం 14న 3PMకు రవీంద్ర భారతిలో కౌంటర్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇటీవల బాలు విగ్రహం ఏర్పాటు విషయంలో <<18452414>>వివాదం<<>> నెలకొన్న విషయం తెలిసిందే.
Similar News
News December 17, 2025
కరీంనగర్ జిల్లాలో 86.42% పోలింగ్ నమోదు

కరీంనగర్ జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 5 మండలాల్లో తుది పోలింగ్ శాతం వివరాలను అధికారులు వెల్లడించారు. మొత్తం 86.42% పోలింగ్ కాగా, ఇల్లందకుంటలో 87.05%, హుజూరాబాద్ లో 85.94%, జమ్మికుంటలో 85.72%, వీణవంకలో 85.87%, సైదాపూర్ లో 87.85% పోలింగ్ నమోదైనట్లు తెలిపారు. మొత్తం 111 గ్రామ పంచాయితీల్లో 165046 ఓట్లకు గాను 142637 ఓట్లు పోలయ్యాయి.
News December 17, 2025
రూపాయి పతనమైతే సామాన్యుడికి ఏంటి సమస్య?

రూపాయి విలువ పడిపోతే తమపై ఏ ప్రభావం ఉండదని సామాన్యులు అనుకుంటారు. ప్రత్యక్షంగా లేకున్నా ఎగుమతి, దిగుమతుల ఖర్చులు పెరగడంతో మందులు, ఎలక్ట్రానిక్స్, పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ద్రవ్యోల్బణాన్ని అదుపుచేయడానికి RBI వడ్డీ రేట్లు పెంచితే లోన్ల EMIలు పెరుగుతాయి. కంపెనీల ఖర్చులు పెరగడంతో ఇంక్రిమెంట్లపై ప్రభావం పడుతుంది. రిక్రూట్‌మెంట్లు తగ్గుతాయి. బోనస్, వేరియబుల్ పే తగ్గే ఛాన్స్ ఉంది.
News December 17, 2025
పూజలతో బ్రహ్మ రాసిన రాతను మార్చొచ్చా?

‘అంతా తలరాత ప్రకారమే జరుగుతుంది అన్నప్పుడు పూజలు ఎందుకు చేయాలి?’ అనే సందేహం కొందరిలో ఉంటుంది. అయితే బ్రహ్మదేవుడు నుదుటిపై రాత రాసేటప్పుడు ‘నేను రాసిన రాతను నేను కూడా తప్పించలేను. కానీ ఉపాసన, ఆరాధన, అర్చనల ద్వారా ఆ విధిని మార్చుకునే శక్తి మీ చేతుల్లోనే పెడుతున్నాను’ అని కూడా రాశాడట. కాబట్టి, మన అర్చనలు, ఉపాసనలు, కర్మల ద్వారా మన విధిని మనం సవరించుకునే అవకాశం ఉంటుంది.


