News March 17, 2025
15రోజుల ముందే వార్షిక ఉత్పత్తి సాధించింది: జీఎం

రామగుండం సింగరేణి సంస్థ RG-1 2024- 25 సంవత్సరానికి 36 లక్షల టన్నుల వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి గాను 15 రోజుల ముందే సాధించిందని GM లలిత్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా OCP-5 ప్రాజెక్ట్ ఆఫీసర్ చంద్రశేఖర్, అధికారులు, యూనియన్ నాయకులు, సూపర్వైజర్లకు ఉద్యోగులకు, కాంట్రాక్టు ఉద్యోగులకు అభినందనలు తెలిపారు.
Similar News
News March 17, 2025
రంజాన్ సెలవు ఎప్పుడంటే?

ఏపీలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో గవర్నమెంట్ క్యాలెండర్ ప్రకారం మార్చి 31న రంజాన్ సెలవు ఉంది. రంజాన్ హాలిడేలో ఏదైనా మార్పులు చోటు చేసుకుంటే సాంఘిక శాస్త్రం పరీక్షలో మార్పు చేయనున్నారు. అంటే మార్చి 31 లేదా ఏప్రిల్ 1న నిర్వహిస్తామని ప్రభుత్వం ఇదివరకే తెలిపింది. అటు తెలంగాణలో మార్చి 21 నుంచి ఏప్రిల్ 2 వరకు టెన్త్ ఎగ్జామ్స్ జరగనున్నాయి.
News March 17, 2025
పెద్దపల్లి: నిరుద్యోగ బీసీ అభ్యర్థులకు ఉచిత ఉపాధి శిక్షణ

ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైన PDPL జిల్లా బీసీ అభ్యర్థులకు హైదరాబాద్‌లో ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు PDPL జిల్లా BC అభివృద్ధి అధికారి రంగారెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తిగల, అర్హులైన నిరుద్యోగ అభ్యర్థులు ఏప్రిల్ 8లోపు www.tgbcstudycircle.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 8782268686కు కాల్ చేసి సంప్రదించాలని సూచించారు. కుల, ఆదాయ పత్రాలతో అప్లై చేసుకోవాలన్నారు. SHARE IT.
News March 17, 2025
శ్రీవారి దర్శనానికి ఎంత సమయమంటే?

AP: తిరుమలలో భక్తుల రద్దీ కాస్త తగ్గింది. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. 9 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న వెంకన్నను 82,721 మంది భక్తులు దర్శించుకున్నారు. అదే సమయంలో హుండీ ఆదాయం రూ.4.46 కోట్లు సమకూరింది.