News November 30, 2024
15 ఏళ్ల క్రితం సెంట్రల్ జైలులో ఉన్నా: KTR

మాజీ మంత్రి, MLA KTR తన గతాన్ని గుర్తు చేసుకుంటూ శనివారం ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘15 ఏళ్ల క్రితం ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొని నవంబర్ 29న అరెస్ట్ అయ్యా. నన్ను వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు. తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమంలో జరిగిన ఈ ఘటన నాకు జీవితాంతం గుర్తుంటుంది. ప్రజల శ్రేయస్సు కోసమే నిత్యం కృషి చేస్తాను’ అని KTR ‘X’లో పోస్ట్ చేశారు.
Similar News
News December 15, 2025
ఎన్నికల డ్యూటీ గైర్హాజరు.. కలెక్టర్ సీరియస్

ఫేస్- 1, ఫేస్-2 ఎన్నికల్లో గైర్హాజరైన 125 మంది పోలింగ్ సిబ్బందిపై చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. కొంత మంది పోలింగ్ సిబ్బంది విధులకు హాజరై రిజిస్టర్లో సంతకాలు చేసి, విధులు నిర్వహించకుండా వెళ్లిపోయినట్లు తెలిసింది. వీరందరిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. మూడవ విడతలో ఎవరైనా ఎన్నికల విధుల్లో పాల్గొనకుండా ఉంటే సస్పెండ్ చేస్తానని ఆయన తెలిపారు.
News December 14, 2025
చేవెళ్ల: కూతురుకు ఓటేసి.. తండ్రి మృతి

ఎన్నికల్లో పోటీచేసిన తన కూతురుకి ఓటు వేసిన ఓ తండ్రి కుప్పకూలాడు. చేవెళ్ల మండలం ఆలూరు గ్రామంలోని 14వ వార్డులో ఓటు వేసి బయటకు వచ్చిన వృద్ధుడు సోలిపేట బుచ్చయ్య (70) చనిపోయారు. ఆలూరు పంచాయతీకి అనుబంధ గ్రామం వెంకన్నగూడ 14వ వార్డులో ఆయన కుమార్తె రాములమ్మ వార్డు సభ్యురాలుగా పోటీలో ఉంది. ఓటు వేసి వస్తుండగా వృద్ధుడు కుప్పకూలి మృతి చెందాడు. అతని మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది.
News December 14, 2025
చేవెళ్ల: సర్పంచ్ ఏకగ్రీవం.. ఒకే వార్డుకు ఎన్నిక.. ఫలితం ఉప సర్పంచ్

చేవెళ్ల మండలం చన్వెల్లి సర్పంచ్ స్థానం ఏకగ్రీవమైన విషయం విధితమే. ఈ పంచాయతీ పరిధిలోని మొత్తం 10 వార్డులు ఉండగా 9 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 8వ వార్డు జనరల్‌కు రిజర్వ్ అయింది. ఈ స్థానంలో ఇద్దరు అభ్యర్థులు సుధాకర్(SC)తో పాటు ఓసీ అభ్యర్థి పి.దీపక్ రెడ్డి పోటీ పడ్డారు. ఆదివారం నిర్వహించిన ఎన్నికల ఫలితాల్లో దీపక్ రెడ్డి విజయం సాధించారు. ఉప సర్పంచ్‌గా అతను ఎన్నికయ్యారు.


