News March 14, 2025
15 నుంచి ఒంటిపూట బడులు

వేసవి తీవ్రత దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ లోకల్ బాడీ పాఠశాలలకు ఈనెల 15 నుండి ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట బడులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పాఠశాలలు నిర్వహించాలని ఆదేశించింది. జిల్లా విద్యాశాఖ అధికారులు మండల విద్యాశాఖ అధికారుల ద్వారా ఉత్తర్వులను, సమయ సరళిని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు పంపిణీ చేయాలని ఆదేశించింది.
Similar News
News March 14, 2025
నెల్లూరులో దారుణ హత్య

నెల్లూరు దారుణ హత్య చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు ఓ వ్యక్తిని దారుణంగా కత్తులతో పొడిచి హత్య చేశారు. గతంలో రామలింగపురం అండర్ బ్రిడ్జి దగ్గర జరిగిన కత్తి రవి హత్య కేసులో ఉన్న చింటూగా తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News March 14, 2025
బాపట్ల జిల్లా TO DAY TOP HEADLINES

◆ పర్చూరు అభివృద్ధి లక్ష్యం: ఎమ్మెల్యే ఏలూరి◆ఉపాధి కూలీలు అపోహలు పడవద్దు: కొరిశపాడు ఏపీవో◆వేటపాలెం: అక్రమ మద్యం స్వాధీనం◆కొల్లూరు: మట్టి రోడ్డుకు అభివృద్ధి పనులు◆సామాన్య ప్రజలకు కార్పొరేట్ వైద్యం: ఎమ్మెల్యే ఏలూరి◆వారంలో ఒకరోజు గ్రామ పర్యటన: వేగేశన◆కారంచేడు: లంపి వైరస్తో ఆవులు విలవిల◆మాణిక్యవేల్ మృతి బాధాకరం: వేమూరు ఎమ్మెల్యే◆సింగరకొండ దేవాలయ స్పెషాలిటీ ఇదే..!
News March 14, 2025
అనంత: రెండు బైక్లు ఢీ.. వ్యక్తి దుర్మరణం

కుందుర్పి మండలం అపిలేపల్లి గ్రామ సమీపంలో శుక్రవారం రాత్రి రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాదంలో ఒకరు మృతి చెందడంతో పాటు మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.