News February 13, 2026

15 మంది బాలలకు విముక్తి: బాపట్ల కలెక్టర్

image

బాల కార్మిక నిర్మూలన చట్టాలు పకడ్బందీగా అమలు చేయాలని బాపట్ల కలెక్టర్ వినోద్ కుమార్ శుక్రవారం తెలిపారు. జిల్లాలో బాల కార్మికులు ఉండరాదన్నారు. బాల కార్మికుల వ్యవస్థ పూర్తిగా నిర్మూలించడమే అధికారుల లక్ష్యం కావాలన్నారు. రెస్క్యూ బృందాలు నిరంతరం తనిఖీలు చేయాలన్నారు. 14 సంవత్సరాలలోపు బాలలంతా కచ్చితంగా పాఠశాలల్లోనే ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. 15 మంది బాలలకు విముక్తి కల్పించామన్నారు.

Similar News

News March 17, 2026

కేయూ పరీక్ష వాయిదా.. ఏప్రిల్‌ 4కు మార్పు

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఎం.ఎస్సీ ఇంటిగ్రేటెడ్‌ కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ పరీక్ష వాయిదా పడింది. మార్చి 18న జరగాల్సిన ఈ పరీక్షను ఏప్రిల్‌ 4కి మార్చినట్లు పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య రాజేందర్ కట్ల తెలిపారు. మిగిలిన అన్ని పరీక్షలు ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారమే యథావిధిగా జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థులు ఈ మార్పును గమనించాలని సూచించారు.

News March 17, 2026

రాష్ట్రానికి అదనంగా 24వేల మెట్రిక్ టన్నుల LPG.. ఆందోళన వద్దు: CM

image

AP: ప్రస్తుతం 15 రోజులకు సరిపడా LPG నిల్వలు ఉన్నాయని, అదనంగా 24 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ వచ్చిందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. గ్యాస్ సిలెండర్ల డెలివరీ సమయాన్ని 1.5 రోజులకు కుదించాలని అధికారులను ఆదేశించారు. ఆస్పత్రులు, హాస్టళ్లు, దేవాలయాలకు ఎలాంటి కొరతా లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. పైప్డ్ గ్యాస్ నెట్‌వర్క్ పెంచేలా కార్యాచరణ రూపొందించాలన్నారు.

News March 17, 2026

మంచిర్యాల: బూత్ స్థాయి ఏజెంట్లను నియమించాలి: కలెక్టర్

image

పారదర్శకమైన ఓటర్ జాబితా రూపకల్పన కోసం రాజకీయ పార్టీలు బూత్ స్థాయి ఏజెంట్లను (BLAs) నియమించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కోరారు. మంగళవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మంచిర్యాల జిల్లాలో త్వరలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ప్రారంభం కానుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా పార్టీలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.