News April 12, 2025

15% వృద్ధిరేటుతో అన్నమయ్య జిల్లా: మంత్రి BC

image

అన్నమయ్య జిల్లా 15% వృద్ధిరేటుతో అభివృద్ధి పథంలో నిలుస్తోందని జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి BC జనార్దన్ రెడ్డి అన్నారు. రాయచోటిలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి, MLAలు షాజహాన్ బాషా, ఆరవ శ్రీధర్, కలెక్టర్ శ్రీధర్, SP విద్యాసాగర్ నాయుడు, అధికారులతో కలసి DRC సమావేశంలో పాల్గొన్నారు. అభివృద్ధి, పేదరికంలేని సమాజమే లక్ష్యంగా అధికారులు, ప్రజాప్రతినిధులు కలసి సమన్వయంతో పనిచేయాలన్నారు.

Similar News

News October 23, 2025

WWC: ప్రతీకా రావల్ సెంచరీ

image

న్యూజిలాండ్‌తో మ్యాచులో మరో ఓపెనర్ ప్రతీకా రావల్ కూడా సెంచరీ చేశారు. 122 బంతుల్లో 13 ఫోర్లతో శతకం నమోదు చేశారు. ఇప్పటికే సెంచరీ చేసిన స్మృతి మంధాన 109 పరుగుల వద్ద ఔట్ అయ్యారు. వీరిద్దరూ 212 పరుగుల రికార్డ్ భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రస్తుతం ప్రతీకాతో పాటు రోడ్రిగ్స్ క్రీజులో ఉన్నారు. భారత్ స్కోర్ 38.1 ఓవర్లకు 239/1.

News October 23, 2025

నిబంధనలు పాటించని కాలేజీలపై ఫిర్యాదు చేయండి: APSCHE

image

AP: కొన్ని కాలేజీలు GOVT రూల్స్ పాటించడం లేదని తమ దృష్టికి వచ్చినట్లు ఏపీ ఉన్నత విద్యామండలి (APSCHE) తెలిపింది. ‘కన్వీనర్ కోటా సీట్లు పొందిన వారి నుంచి అధిక ఫీజు వసూలు చేస్తున్నాయి. ఇవ్వకుంటే అడ్మిషన్‌ నిరాకరిస్తున్నాయి. కాలేజీల్లో ర్యాగింగ్ నిరోధ చర్యలు తీసుకోవడం లేదు. మహిళలపై వేధింపుల నివారణలోనూ విఫలమవుతున్నాయి’ అని పేర్కొంది. వీటిపై తమకు లేదా వర్సిటీకి, APHERMCకి ఫిర్యాదు చేయాలని సూచించింది.

News October 23, 2025

చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు.. CM సూచనలు

image

చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు దుబాయ్ నుంచి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ సుమిత్ కుమార్ పాల్గొన్నారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని CM సూచించారు. చెరువులకు గండ్లు పడకుండా బలహీనంగా ఉన్న చోట్ల పటిష్టం చేయాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆయన కలెక్టర్‌కు వివరించారు.