News March 19, 2024

15 వేల ఫ్లెక్సీలు తొలగింపు: కలెక్టర్ 

image

ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో భాగంగా విజయనగరం జిల్లాలో ఇప్పటి వరకు సుమారు 15 ఫ్లెక్సీలు, పోస్టర్లు, బ్యానర్లను తొలగించినట్లు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఉన్న 314 విగ్రహాలకు ముసుగులు తొడిగామని, 38 హోర్డింగ్‌లు, 14,540 పోస్టర్లు, ఫ్లెక్సీలు, బ్యానర్లను తొలగించామన్నారు. ఎన్నికల కోడ్ ఖచ్చితంగా అమలు చేస్తున్నామని కలెక్టర్ వెల్లడించారు.

Similar News

News April 15, 2026

VZM: ‘ఎన్టీఆర్‌ను పదవి నుంచి దించేందుకు బంగ్లా నుంచే అంకురార్పణ’

image

ప్రజలకు సేవ చేయడం మానేసి ఫ్లెక్సీల రాజకీయాలు చేయడం తగదని వైసీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. బొత్స‌పై ఫ్లెక్సీలు వేయడంపై బుధవారం విజయనగరంలో మీడియాతో మాట్లాడారు. అనాడు ఎన్టీఆర్‌ను పదవిచ్యుతుడిని చేయడానికి బంగ్లా కారణం కాదా అని ప్రశ్నించారు. ఎన్టీఆర్‌ను పదవి నుంచి దించడంలో బంగ్లాలోనే అంకురార్పణ జరిగిందన్నారు. బొత్స దిగువ స్థాయి నుంచి రాజకీయాల్లో అంచెలంచెలగా ఎదిగారన్నారు.

News April 15, 2026

ఇంటర్ ఫలితాల్లో వెనబడిన విజయనగరం జిల్లా

image

ఇంటర్ ఫలితాల్లో విజయనగరం జిల్లా <<19653702>>విద్యార్థులు<<>> వెనుకబడ్డారు. ఫస్ట్ ఇయర్‌లో 16,984 మంది పరీక్షలు రాయగా 12,268 మంది పాసయ్యారు. 72 శాతం పాస్ పర్సంటేజీతో రాష్ట్రంలో 16వ స్థానంలో నిలిచింది. సెకండ్ ఇయర్‌లో 16,456 మంది పరీక్షలు రాయగా 12,456 మంది పాసయ్యారు. 76 శాతం పాస్ పర్సంటేజీతో రాష్ట్రంలో 18వ స్థానంలో నిలిచింది.