News September 20, 2024
15 శాతం వృద్ధిరేటు సాధించాలి: కలెక్టర్
కర్నూలు జిల్లాలో రానున్న కాలంలో అన్ని రంగాల్లో దాదాపుగా 15% వృద్ధిరేటు సాధించాలని కలెక్టర్ రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. గురువారం వంద రోజుల ప్రణాళిక అమలుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. స్వర్ణాంధ్ర @2047 లక్ష్య సాధనలో భాగంగా జిల్లా, మండల స్థాయి ప్రణాళికలను రూపొందించాలని ఆదేశించారు. వ్యవసాయ అనుబంధ రంగాలు, పరిశ్రమలు, మానవ వనరులు, వైద్య విధానం, తదితర వాటిలో అభివృద్ధి ప్రణాళికలు ఉండాలన్నారు.
Similar News
News November 13, 2024
పశుగ్రాసాల సాగు చేయటానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం
ఆస్పరి: రైతులకు పశుగ్రాసం కొరత ఏర్పడకుండా పశుగ్రాసాల సాగు చేయటానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందని జేడి శ్రీనివాసులు తెలిపారు. మంగళవారం గ్రామ పశు వైద్య కార్యాలయంలో రికార్డులు తనిఖీ చేశారు. ఎన్ఎల్ఎం ద్వారా గొర్రెల పెంపకానికి కేంద్ర ప్రభుత్వం 50 శాతం సబ్సిడీతో రైతులకు ఆర్థిక సాయం అందిస్తుందన్నారు. రైతులు ముందుకు వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News November 12, 2024
BIG NEWS: యురేనియం తవ్వకాల నిలిపివేతకు ఆదేశాలు
కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలో యురేనియం తవ్వకాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యురేనియం తవ్వకాలను తక్షణమే ఆపేయాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ప్రజల ఆందోళనల దృష్ట్యా ఇప్పటికే తవ్వకాలు నిలిపివేసినట్లు అధికారులు చెప్పారు. కాగా, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా స్పష్టం చేశారు.
News November 12, 2024
సంక్షేమ వసతి గృహాలను పరిశుభ్రంగా ఉంచండి- కలెక్టర్
నంద్యాల జిల్లాలోని 86 ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు పిల్లలకు వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాలులో వసతి గృహాల సంక్షేమ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మౌలిక వసతుల ఏర్పాటుపై వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవాలని వెల్ఫేర్ సూచించారు. విద్యార్థులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించాలన్నారు.