News April 7, 2025
15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ పూర్తి: మంత్రి అనగాని

ప్రజలు వ్యవసాయ భూములు, స్థలాలు అమ్మడం లేదా కొనుగోలు చేసినప్పుడు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కేవలం 15నిమిషాల్లో పూర్తి అవుతుందని రెవెన్యూ&రిజిస్ట్రేషన్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం ప్రకటన విడుదల చేశారు. రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్‌లో డిజిటల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి, స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చని ఆయన తెలిపారు. దీంతో సేవలు సులభతరమన్నారు.
Similar News
News April 10, 2025
ADBలో ఏడుగురి అరెస్ట్: CI

ఆదిలాబాద్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏడుగురు పేకాటరాయుళ్లను అరెస్ట్ చేశారు. శాంతినగర్‌లో CCS ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్‌కు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేయగా ఏడుగురు వ్యక్తులు పట్టుబడ్డారని ADB ఒకటో పట్టణ సీఐ సునీల్ కుమార్ తెలిపారు. వారి నుంచి రూ.2,620 నగదు, ఒక బైక్, 9 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఆదిలాబాద్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశామన్నారు.
News April 10, 2025
ఆసిఫాబాద్: బాధ్యతలు స్వీకరించిన డీఎండబ్ల్యూఓ నదీం

జిల్లా ఆర్టికల్చర్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న అబ్దుల్ నదీమ్ ఖుద్దూసిని జిల్లా మైనార్టీ శాఖ అధికారిగా కలెక్టర్ వెంకటేష్ దోత్రే ఇటీవలే నియమించిన విషయం తెలిసిందే. నేడు ఆయన మైనార్టీ శాఖ అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మైనార్టీ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు ఆయనను కలిసి సన్మానించారు. మైనార్టీల సంక్షేమం కోసం కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు.
News April 10, 2025
సదాశివపేట: మహిళా అదృశ్యం.. కేసు నమోదు

మహిళా అదృశ్యమైన ఘటన సదాశివపేట మండలంలో జరిగింది. సీఐ మహేష్ గౌడ్ తెలిపిన వివరాలు.. మండలంలోని రేజింతల్ గ్రామానికి చెందిన మారేపల్లి లక్ష్మి(45) ఈనెల 7న ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్లింది. కుటుంబ సభ్యులు వెతికిన ఆచూకీ లభించలేదు. బాధితురాలి కుమారుడు మారేపల్లి శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సమాచారం తెలిస్తే 8712656721 సంప్రదించాలన్నారు.