News March 29, 2024

లోక్‌సభ ఎన్నికల బరిలో 15 మంది మాజీ సీఎంలు!

image

లోక్‌సభ ఎన్నికల్లో 15 మంది మాజీ CMలు పోటీ చేయనున్నారు. NDA నుంచి 12, ఇండియా కూటమి నుంచి ముగ్గురు బరిలో ఉన్నారు. NDA తరఫున శివరాజ్‌(MP), సోనోవాల్(AS), బిప్లవ్(త్రిపుర), త్రివేంద్ర(ఉత్తరాఖండ్), మనోహర్(HR), రాజ్‌నాథ్(UP), అర్జున్(ఝార్ఖండ్), జగదీశ్, బసవరాజ్(KA), కిరణ్(AP), కుమారస్వామి, జగదాంబికా పోటీ చేస్తున్నారు. INC నుంచి దిగ్విజయ్, భూపేశ్, నబంతుకి బరిలో ఉన్నారు. <<-se>>#Elections2024<<>>

Similar News

News January 6, 2026

ఒమన్‌లో పెళ్లికి ముందు హెల్త్ చెకప్ తప్పనిసరి!

image

ఒమన్‌లో ఇకపై పెళ్లి చేసుకోవాలనుకునే వారు తప్పనిసరిగా హెల్త్ చెకప్ చేయించుకోవాలని అక్కడి ప్రభుత్వం ఆదేశించింది. జనవరి 1 నుంచి ఈ రూల్ అమల్లోకి వచ్చింది. జంటలో ఒకరు విదేశీయులైనా ఈ టెస్టులు కంపల్సరీ. జన్యుపరమైన వ్యాధులను గుర్తించడం, హెపటైటిస్, HIV వంటి వైరస్‌లు ఒకరి నుంచి మరొకరికి లేదా పుట్టబోయే బిడ్డకు సోకకుండా చూడటం దీని ప్రధాన ఉద్దేశం. రిజల్ట్స్‌ను మూడో వ్యక్తికి చెప్పొద్దనే నియమం పెట్టారు.

News January 6, 2026

కుజ దోష నివారణకు శుభప్రదం ‘మంగళ వారం’

image

జాతకంలో కుజ దోషంతో సమస్యలు ఎదుర్కొనే వారు మంగళవారం నాడు ప్రత్యేక పూజలు చేయడం విశేష ఫలితాలుంటాయి. కుజుడికి అధిపతి అయిన సుబ్రహ్మణ్య స్వామిని, హనుమంతుడిని ఆరాధిస్తే దోష తీవ్రత తగ్గుతుంది. ఎరుపు దుస్తులు ధరించి పూజ చేయాలి. కందులు దానం చేయడం, కుజ అష్టోత్తరం పఠించడం వల్ల జాతకంలోని ప్రతికూలతలు తొలగి సుఖశాంతులు చేకూరుతాయి. భక్తితో చేసే ఈ పరిహారాలు మానసిక ధైర్యాన్ని ఇచ్చి కార్యసిద్ధికి మార్గం చూపుతాయి.

News January 6, 2026

ఇంటర్వ్యూతో ఎయిమ్స్ మంగళగిరిలో ఉద్యోగాలు

image

ఏపీ: మంగళగిరిలోని <>ఎయిమ్స్<<>> టూటర్/డెమాన్‌స్ట్రేటర్, సీనియర్ రెసిడెంట్స్ పోస్టులను భర్తీ చేయనుంది. పోస్టును బట్టి ఎండీ, ఎంఎస్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు JAN 7, 8, 9 తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. స్క్రీనింగ్‌, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు ఉదయం 8.30 గంటలకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. వెబ్‌సైట్: https://www.aiimsmangalagiri.edu.in