News February 10, 2025

శ్రీవారి సర్వ దర్శనానికి 15గంటల టైమ్

image

AP: తిరుమలలో టోకెన్లు లేని భక్తులు శ్రీవారిని దర్శించుకోవడానికి 15 గంటల సమయం పడుతోంది. వేంకటేశ్వర స్వామి దర్శనానికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 27 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 84,536 మంది దర్శించుకోగా, 25,890 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.67 కోట్లు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.

Similar News

News October 29, 2025

భారీ వర్షంతో తొలి టీ20 రద్దు

image

ఆస్ట్రేలియా-భారత్ మధ్య కాన్‌బెర్రాలో జరిగే తొలి టీ20 రద్దయింది. వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తుండటంతో మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా దూకుడుగా ఆడింది. 9.4 ఓవర్లలో 97/1 రన్స్ చేసింది. అభిషేక్ 19 రన్స్ చేసి ఔటవ్వగా.. గిల్ 37*, సూర్య 39* దూకుడుగా ఆడారు.

News October 29, 2025

అర్ష్‌దీప్ బదులు హర్షిత్.. నెటిజన్ల ఆగ్రహం

image

ఆస్ట్రేలియాతో తొలి టీ20లో అర్ష్‌దీప్ సింగ్ బదులు హర్షిత్ రాణాను ప్లేయింగ్-11లోకి తీసుకోవడంపై నెటిజన్లు టీమ్ మేనేజ్‌మెంట్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన అర్ష్‌దీప్‌ను ఎందుకు పక్కనబెట్టారని ప్రశ్నిస్తున్నారు. హర్షిత్‌కు గంభీర్ సపోర్ట్ ఎక్కువగా ఉందని, బీసీసీఐలో రాజకీయాలు ఎక్కువ అయ్యాయని ఫైర్ అవుతున్నారు. దీనిపై మీ కామెంట్?

News October 29, 2025

ఆవు పాల అభిషేకంతో కష్టాల నుంచి విముక్తి

image

కార్తీక మాసంలో శివారాధన గొప్ప ఫలితాలనిస్తుందని మనకు తెలిసిందే. అందుకే చాలామంది శివాలయాలకు వెళ్లి శివలింగాలకు అభిషేకాలు చేస్తుంటారు. అయితే శివుడికి ఆవు పాలతో అభిషేకం చేయడం అత్యంత పవిత్రమని పండితులు సూచిస్తున్నారు. ఈ అభిషేకం ద్వారా కష్టాలు తొలగిపోతాయని అంటున్నారు. ‘గోమాత పాలు శుభాలకు, పవిత్రతకు చిహ్నం. ఈ అభిషేకం వల్ల శివుడు సంతృప్తి చెంది, జీవితంలో సుఖశాంతులు నెలకొనేలా ఆశీర్వదిస్తాడు’ అంటున్నారు.