News March 7, 2025

ఒక్కో చిన్నారి రూ.5 లక్షలకు విక్రయం.. 15 మంది అరెస్ట్

image

HYDలో కలకలం రేపిన చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో 15 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అహ్మదాబాద్‌కు చెందిన వందన తన ముఠాతో కలిసి పిల్లల్ని విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఆస్పత్రులు, రోడ్లపై చెత్త ఏరుకునే పిల్లల్ని అపహరించడం, బీద తల్లిదండ్రుల నుంచి ₹2.5LK-₹3.5Lకు కొనుగోలు చేసి ఒక్కో చిన్నారిని ₹5Lకు పిల్లలు లేని వారికి అమ్మినట్లు గుర్తించారు. వందనను 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరారు.

Similar News

News January 18, 2026

మిచెల్ మరో సెంచరీ..

image

టీమ్ ఇండియాతో మూడో వన్డేలో న్యూజిలాండ్ ప్లేయర్ <<18860730>>మిచెల్<<>> 106 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నారు. వరుసగా ఇది రెండో శతకం కావడం గమనార్హం. అటు ఈ సిరీస్‌లో 300+ స్కోరుతో కొనసాగుతున్నారు. భారత్‌పై వన్డేల్లో 11 ఇన్నింగ్సుల్లో మిచెల్‌కు ఇది నాలుగో సెంచరీ. ప్రస్తుతం న్యూజిలాండ్ స్కోర్ 36 ఓవర్లలో 201/3గా ఉంది.

News January 18, 2026

ఎన్టీఆర్, YSR సెంటిమెంటుతో రేవంత్ వ్యూహం!

image

TG: ఖమ్మం పాలేరులో జరిగిన సభలో CM రేవంత్ ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రస్తావన తీసుకొచ్చారు. NTR స్ఫూర్తితో సన్నబియ్యం, YSR స్ఫూర్తితోనే ఉచిత కరెంట్ ఇస్తున్నామని పేర్కొన్నారు. వీరిని ఆదర్శంగా తీసుకొని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ఈ దివంగత నేతలకు ఖమ్మంలో ఫాలోయింగ్ ఎక్కువనే సంగతి తెలిసిందే. దీంతో మున్సిపల్ ఎన్నికల్లో BRSను ఓడించేందుకు CM వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది.

News January 18, 2026

రుక్మిణీ వసంత్ డేటింగ్?.. క్లారిటీ!

image

‘కాంతార-2’ భామ రుక్మిణీ వసంత్ ఫొటో SMలో వైరలవుతోంది. ఓ వ్యక్తితో ఆమె క్లోజ్‌గా ఉండటంతో వీరిద్దరు రిలేషన్‌లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. అయితే ఫొటోలో ఉన్న వ్యక్తి సిద్ధాంత్ నాగ్ కాగా, అతనొక ఫొటోగ్రాఫర్ అని సమాచారం. వీరిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అని తెలుస్తోంది. ఇది 2023లో దిగిన ఫొటో కాగా తాజాగా వైరలవ్వడం గమనార్హం. ప్రస్తుతం రుక్మిణి ఎన్టీఆర్-నీల్, టాక్సిక్ మూవీల్లో నటిస్తున్నారు.