News October 4, 2024

15 శాతం వృద్ధి రేటు సాధించాలి: సీఎం చంద్రబాబు

image

AP: గత ప్రభుత్వ అస్పష్ట ఆర్థిక విధానాల కారణంగా చితికిపోయిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలని సీఎం చంద్రబాబు అన్నారు. 15 శాతం వృద్ధి రేటు సాధించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వ్యవసాయం, పారిశ్రామిక, సేవల రంగంలో సాధించాల్సిన వృద్ది రేటుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. విభజన కష్టాలున్నా 2014-19లో 13.7% వృద్ధిరేటును సాధించామని, గడిచిన 5 ఏళ్లలో వృద్ధి రేటు 10.59%కి పడిపోయిందని చెప్పారు.

Similar News

News October 8, 2024

FLASH: లీడింగ్‌లో వినేశ్ ఫొగట్

image

భారత మాజీ మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగట్ లీడింగ్‌లో ఉన్నారు. హరియాణాలోని జులానా నియోజకవర్గం నుంచి ఆమె కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు. ఆమె రెజ్లింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించి ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. మరోవైపు మాజీ సీఎం, కాంగ్రెస్ అభ్యర్థి భూపేందర్ సింగ్ సైతం గర్హి సంప్లా‌లో ఆధిక్యంలో ఉన్నారు. అక్కడ మ్యాజిక్ ఫిగర్ 46 కాగా కాంగ్రెస్ 54 సీట్ల ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

News October 8, 2024

అందరి చూపు ఆ ఇద్దరిపైనే.. గెలుస్తారా?

image

హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో వెలువడనున్నాయి. 90 సెగ్మెంట్లకు 1,031 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా దేశం మొత్తం ఇద్దరి ఫలితం కోసం ఎదురుచూస్తోంది. పారిస్ ఒలింపిక్స్‌ తర్వాత ఎంతో ఆదరణ పొందిన రెజ్లర్ వినేష్ ఫొగట్‌‌ జులానా నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు. మరొకరు భారత కబడ్డీ జట్టు మాజీ కెప్టెన్ దీపక్ హుడా. ఈయన మెహమ్ నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు.

News October 8, 2024

UAE నుంచి భారత్‌కు $100bns పెట్టుబడులు: పీయూష్ గోయల్

image

రాబోయే సంవత్సరాల్లో UAE నుంచి $100bns పెట్టుబడులను భారత్ ఆకర్షిస్తుందని వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి డేటా సెంటర్లు, AI, రెన్యూవబుల్ ఎనర్జీ, ట్రాన్స్‌మిషన్ ఇన్ఫ్రా రంగాల్లోకి గణనీయంగా పెట్టుబడులు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ప్రోత్సాహకంగా వారికి ఉచితంగా భూములు ఇస్తామన్నారు. ప్రస్తుతం ఈక్విటీల్లో UAE ప్రత్యక్ష పెట్టుబడులు $20bnsగా ఉన్నాయి. 2023లోనే $3bns వచ్చాయి.