News September 22, 2024
వారి అకౌంట్లలో రూ.15వేలు జమ: కేంద్రమంత్రి

బడ్జెట్లో ప్రకటించినట్లుగానే కొత్తగా ఉద్యోగాల్లో చేరేవారికి నెల వేతనాన్ని EPF అకౌంట్లలో జమ చేయనున్నట్లు కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ఈమేరకు గరిష్ఠంగా ఒక ఉద్యోగికి రూ.15వేలు అందనుంది. ఇక తెలంగాణలో 36,018 సంస్థల కింద 47.96లక్షల మంది చందాదారులు, 4.54లక్షల మంది పెన్షన్ తీసుకునేవారున్నట్లు కేంద్రమంత్రి HYDలోని PF కార్యాలయంలో తెలిపారు.
Similar News
News January 23, 2026
‘రిపబ్లిక్ డే‘ వేడుకల్లో అమరావతి రైతులకు ప్రత్యేక గ్యాలరీ

AP: రిపబ్లిక్ డే ని మొదటిసారి ఈ ఏడాది అమరావతిలోని సీడ్ యాక్సిస్ రోడ్డులో నిర్వహించేందుకు CRDA అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో అమరావతి రైతులకు ప్రత్యేక VIP గ్యాలరీ ఏర్పాటు చేశారు. వారికి ప్రత్యేక ఆహ్వాన పత్రికలు పంపుతున్నారు. 13 వేల మందికి వీలుగా సీటింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటి వరకూ రిపబ్లిక్ డే, స్వతంత్ర దినోత్సవాలను విజయవాడ మున్సిపల్ స్టేడియంలో చేపట్టేవారు.
News January 23, 2026
గోదావరి పుష్కరాలకు 10 కోట్ల మంది!

AP: 2027 జూన్ 26 నుంచి ప్రారంభమయ్యే గోదావరి పుష్కరాలకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని CM CBN అధికారులను ఆదేశించారు. 3వ సారి ఈ పుష్కరాలు నిర్వహిస్తుండడం తన అదృష్టమని వ్యాఖ్యానించారు. ‘పోలవరం’ పనులు ఈలోగా పూర్తిచేయాలన్నారు. పోలవరం, ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లో పుష్కరాలకు ఏర్పాట్లు చేయాలన్నారు. పుష్కరాలకు 10కోట్ల మంది వచ్చే అవకాశముందని అంచనా వేస్తున్నారు.
News January 23, 2026
వంట గది ఏ వైపున ఉండాలి?

వంటగది ఇంటి ఆగ్నేయ మూలలో ఉండాలని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. దీనివల్ల సరిపడా గాలి, వెలుతురు వచ్చి ఇల్లాలు అలసట లేకుండా వంట చేయగలదని చెబుతున్నారు. ‘వంటగదిలో పూజ గది ఉండటం శ్రేయస్కరం కాదు. శుభ్రంగా ఉంచుకోవాలి. విరిగిన, పగుళ్లు ఇచ్చిన గాజు, పింగాణీ పాత్రలను ఉంచకూడదు. ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే వంట రుచికరంగా ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యుల ఆరోగ్యం బాగుంటుంది’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>


