News December 10, 2025

150 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

image

<>RITES <<>>150 సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు DEC 30 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల వారు అర్హులు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 40 ఏళ్లు. రాతపరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. జనవరి 11న రాత పరీక్ష నిర్వహిస్తారు. నెలకు జీతం రూ.29,735 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://rites.com

Similar News

News December 16, 2025

బీట్ రూట్ సాగులో కలుపు నివారణ ఎలా?

image

బీట్ రూట్‌లో కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తొలగించాలి. విత్తిన 24-48 గంటల్లోపు ఎకరాకు తేలిక నేలల్లో 200 లీటర్ల నీటిలో పెండిమిథాలిన్ 1.25 లీటర్లు, అదే బరువు నేలల్లో అయితే 200 లీటర్ల నీటిలో అలాక్లోర్ 1.25L కలిపి పిచికారీ చేయాలి. విత్తిన 15 రోజులకు 200 లీటర్ల నీటిలో మెట్రిబుజిన్ 300 గ్రా. కలిపి పిచికారీ చేయాలి. గింజ మొలకెత్తిన 20-25 రోజుల తర్వాత కలుపు తీసి మన్ను ఎగదోస్తే గడ్డ బాగా ఊరుతుంది.

News December 16, 2025

99 పైసలకు భూములిస్తామంటే ఎగతాళి చేశారు: లోకేశ్

image

AP: అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపడమే తమ లక్ష్యమని మంత్రి లోకేశ్ చెప్పారు. ఐటీ కంపెనీలన్నీ విశాఖకే వస్తున్నాయని తెలిపారు. CM CBN విజన్‌తో ముందుకెళ్తున్నారని చెప్పారు. భోగాపురంలో AAD ఎడ్యుసిటీ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. ‘కొంత మంది విజన్‌లెస్ మనుషులు విజనరీలను విమర్శిస్తారు. 99 పైసలకు భూములిస్తామంటే ఎగతాళి చేశారు. ఆ నిర్ణయంతోనే కాగ్నిజెంట్, TCS వచ్చాయి’ అని వెల్లడించారు.

News December 16, 2025

ఆరోగ్య భద్రతకు డిజిటల్ హెల్త్ రికార్డులు: CBN

image

AP: ప్రజల ఆరోగ్య భద్రతకు సంజీవని ప్రాజెక్టు కింద డిజిటల్ హెల్త్ రికార్డులు రూపొందిస్తున్నట్లు CM CBN తెలిపారు. రియల్ టైమ్‌లోనే ఆరోగ్య వివరాలు తెలుసుకునేలా సంజీవని ద్వారా ఇంటిగ్రేట్ చేస్తున్నామన్నారు. ‘రోగాలను ముందుగా నిరోధించే ప్రివెంటివ్ టెక్నాలజీస్‌పై దృష్టి పెట్టాలి. యోగా, నేచురోపతిని ప్రోత్సహించాలి. డిజిటల్ ఏఐ ఎనేబుల్డ్ హెల్త్, హెల్త్ ఫైనాన్సింగ్ రిఫార్మ్స్‌పై దృష్టి పెట్టాలి’ అని సూచించారు.