News November 20, 2025

150 పోస్టులకు TCIL నోటిఫికేషన్

image

టెలి కమ్యూనికేషన్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (TCIL)150 కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు DEC 9 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, డిప్లొమా, ITI, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫారమ్‌ను tcilksa@tcil.net.inకు, tcilksahr@gmail.com ఇ మెయిల్ ద్వారా పంపాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.tcil.net.in/

Similar News

News November 22, 2025

పైరసీని ఎలా ఆపాలి?.. RGV సలహా ఇదే

image

భయం మాత్రమే పైరసీని ఆపగలదని డైరెక్టర్‌ RGV ట్వీట్ చేశారు. పైరసీ ఎప్పటికీ ఆగదని, దానికి కారణం టెక్నాలజీ కాదని పైరసీ చూడడానికి సిద్ధంగా ఉన్న ప్రేక్షకులే అని అభిప్రాయపడ్డారు. “సినిమా టికెట్ ధర ఎక్కువ కాబట్టి పైరసీ సరైంది అంటున్నారు. మరి నగలు ఖరీదుగా ఉంటే దుకాణాన్ని దోచుకుంటామా?” అని ప్రశ్నించారు. పైరసీని ఆపాలంటే అక్రమ లింకులు ఇచ్చేవారితో పాటు వాటిని చూస్తున్నవారిని కూడా శిక్షించాలని సూచించారు.

News November 22, 2025

ఇంటర్ అర్హతతో 3,058 పోస్టులు.. అప్లై చేశారా?

image

రైల్వేలో 3,058 అండర్ గ్రాడ్యుయేట్ నాన్ టెక్నికల్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఇంటర్ అర్హతగల వారు ఈనెల 27 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు18- 30 ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, స్కిల్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.500. SC,ST, PwBD, మహిళలకు రూ.250. మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.

News November 22, 2025

రాష్ట్రంలో 78 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

TG: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో 78 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి MBBS,MD,MS,DNB,PG డిగ్రీ, పీజీ డిప్లొమా, DM,M.CH,MSC, PhD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. జీతం నెలకు రూ.లక్ష నుంచి రూ.1,90,000 వరకు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://rajannasircilla.telangana.gov.in./