News March 17, 2024
ఉమ్మడి తూ.గో జిల్లాలో 1,513 కేసులు పరిష్కారం
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత ఆధ్వర్యంలో 64 బెంచ్లు ఏర్పాటు చేశారు. ఈ మేరకు జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలో మొత్తం 1,513 కేసులను పరిష్కరించారు. బాధితులకు రూ.2.30 కోట్ల నష్టపరిహారం అందజేశారు.
Similar News
News February 2, 2025
రాజమండ్రి: ఎమ్మెల్సీగా అఖండ మెజార్టీతో గెలిపించండి
ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఎన్నికలలో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మెజారిటీతో తనను గెలిపించాలని ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ కోరారు. శనివారం రాజమండ్రిలో రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అధ్యక్షతన జరిగిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం చేసిన నిర్వాకం వల్ల రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నామన్నారు. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునేందుకు కూటమి ప్రభుత్వం పని చేస్తుందన్నారు.
News February 1, 2025
రాజమండ్రిలో వ్యక్తి మృతి
రాజమండ్రి రూరల్ మండలం కవలగొయ్యి గ్రామానికి చెందిన తీపర్తి బుల్లిబాబు(45) కాకినాడ GGHలో శుక్రవారం మృతి చెందాడు. బొమ్మూరు ఎస్సై అంకారావు వివరాల మేరకు.. ఈనెల 26న బుల్లిబాబు భార్యను మద్యం తాగేందుకు డబ్బులు అడిగాడు. ఆమె డబ్బులు లేవనిచెప్పడంతో గడ్డిమందు తాగాడు. కుటుంబ సభ్యులు అతనిని చికిత్స నిమిత్తం మెరుగైన వైద్యానికి కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు.
News February 1, 2025
పా.గో : సర్పంచ్ పేరుతో అపరిచిత వ్యక్తుల దరఖాస్తులు
పా.గో జిల్లాలోని మండల కేంద్రమైన తాళ్లపూడి సర్పంచ్ లాగిన్లో అపరిచిత వ్యక్తులు ప్రధాని మంత్రి విశ్వకర్మ యోజన పథకానికి దరఖాస్తులు అప్లోడ్ చేశారు. ఈ విషయమై సర్పంచ్ నక్కా అనురాధ కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు శుక్రవారం తెలిపారు. సర్పంచ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి దరఖాస్తులు చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేయాలని సర్పంచ్ కోరారు.