News September 3, 2025
బీటెక్ అర్హతతో 1,534 పోస్టులు

పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(PGCIL)లో కాంట్రాక్టు ప్రాతిపదికన 1,534 పోస్టులకు ఈ నెల 17 వరకు అప్లై చేసుకోవచ్చు. ఫీల్డ్ ఇంజినీర్, ఫీల్డ్ సూపర్‌వైజర్ ఉద్యోగాలున్నాయి. బీఈ, బీటెక్, డిప్లొమా, ఎంఈ/ఎంటెక్‌లో 55% మార్కులతో పాసైన, 29ఏళ్లలోపు వారు అర్హులు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. పోస్టును బట్టి ₹23K నుంచి ₹1.20L వరకు జీతం ఉంటుంది.
వెబ్‌సైట్: <
Similar News
News September 5, 2025
PKL: బోణీ కొట్టిన తెలుగు టైటాన్స్

ప్రో కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ బోణీ కొట్టింది. జైపూర్ పింక్ పాంథర్స్‌తో జరిగిన మ్యాచులో 37-32 పాయింట్ల తేడాతో గెలిచింది. టైటాన్స్ ప్లేయర్లు విజయ్ మాలిక్, భరత్ చెరో 8 పాయింట్లతో అదరగొట్టారు. డిఫెన్స్‌లో ఏకంగా 14 పాయింట్లు రాబట్టారు. అంతకుముందు రెండు మ్యాచుల్లోనూ తెలుగు టైటాన్స్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే.
News September 5, 2025
ఏయూకు స్టేట్ పబ్లిక్ యూనివర్సిటీ విభాగంలో 4వ స్థానం

AP: స్టేట్ పబ్లిక్ యూనివర్సిటీ విభాగంలో ఆంధ్రా యూనివర్సిటీ దేశంలో నాలుగో స్థానంలో నిలిచింది. గతేడాదితో పోలిస్తే ఈ సారి మూడు స్థానాలు మెరుగుపరుచుకుంది. యూనివర్సిటీ విభాగంలో 23వ స్థానానికి చేరుకుంది. ఏయూ ఫార్మసీ కాలేజీ 31, ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ 88వ స్థానంలో, డాక్టర్ BR అంబేడ్కర్ న్యాయ కళాశాల 16వ స్థానంలో నిలిచాయి. AU నాలుగో స్థానంలో నిలవడం పట్ల మంత్రి లోకేశ్ అభినందనలు తెలిపారు.
News September 5, 2025
ఎల్లో అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలు

TG: రేపు ఉదయం 8.30 గంటల్లోపు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది. ADB, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, KNR, జగిత్యాల, సిరిసిల్ల, PDPL, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, MHBD, WGL, HNK, రంగారెడ్డి, HYD, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డికి IMD ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మిగతా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.