News February 4, 2026

154 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

image

బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL) 154 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల వారు FEB 18 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, టెన్త్, ఇంటర్, ITI, డిప్లొమా, MLT, BE/BTech, MSc, MA/MSW, MCA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ/స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.becil.com

Similar News

News February 6, 2026

SACONలో 36 పోస్టులు… అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

image

సలీం అలీ సెంటర్ ఫర్ ఆర్నిథాలజీ అండ్ నేచురల్ హిస్టరీ(SACON)లో 36పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో పీహెచ్‌డీ, పీజీ, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.500, SC, ST, PwBD, EWSలకు రూ.100. వెబ్‌సైట్: www.sacon.in

News February 6, 2026

‘యుఫోరియా’ సినిమా రివ్యూ&రేటింగ్

image

యువత డ్రగ్స్‌కు అలవాటు పడితే ఏం జరుగుతుంది? ఆ మత్తులో చేసే అకృత్యాల వల్ల జీవితాలు ఎలా మారిపోతాయనేదే స్టోరీ. భూమిక, సారా నటన, యూత్‌ను ఆలోచింపజేసే అంశాలు ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్ మెప్పిస్తుంది. కథను ఆసక్తికరంగా చెప్పడంలో దర్శకుడు గుణశేఖర్ తడబడ్డారు. సెకండాఫ్‌ స్క్రీన్ ప్లే కన్ఫ్యూజింగ్‌గా ఉంది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తీయడంతో కొన్ని సీన్లు ఊహించేలా ఉంటాయి. మ్యూజిక్ ఫర్వాలేదు.
రేటింగ్: 2.25/5

News February 6, 2026

నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

image

దేశీయ స్టాక్‌ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. నిఫ్టీ దాదాపు 100 పాయింట్ల నష్టంతో 25,535 వద్ద, సెన్సెక్స్ 300 పాయింట్లు తగ్గి 83,000 వద్ద ట్రేడ్‌ అవుతోంది. నేడు RBI మానిటరీ పాలసీ ప్రకటన ఉండటంతో పెట్టుబడిదారులు దానికోసం వేచిచూస్తున్నారు. మరోవైపు అమెరికా సహా పలు గ్లోబల్‌ మార్కెట్లు సైతం నష్టాల్లో ఉండటం దేశీయంగా ప్రభావం చూపిస్తోంది. దీంతో మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.