News December 14, 2025

15,762 ప్రభుత్వ ఉద్యోగాలు.. దరఖాస్తుకు రేపే లాస్ట్

image

జవహర్ నవోదయ, కేంద్రీయ విద్యాలయాల్లో 15,762 (పెంచిన తరువాత) ఉద్యోగాలకు దరఖాస్తు గడువు రేపటితో ముగియనుంది. KVSలో 9,921, NVSలో 5841 పోస్టులున్నాయి. పోస్టును బట్టి PG, డిగ్రీ, B.Ed, M.Ed, MCA, M.PEd, CTET, ఇంటర్, డిప్లొమా పాసైనవారు అర్హులు. CBT, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఇప్పటికే రెండు సార్లు గడువు పొడిగించినందున మరోసారి అవకాశం ఉండకపోవచ్చు. సైట్: https://www.cbse.gov.in/

Similar News

News April 14, 2026

కిడ్నీ వ్యాధిని ముందే పసిగట్టేలా పరీక్షలు: మంత్రి

image

AP: ఉద్ధానం వాసులను పట్టిపీడిస్తున్న కిడ్నీ వ్యాధిని ముందే పసిగట్టి ఉపశమనం కల్పించే చర్యలు చేపట్టామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. ‘‘బయోమార్కర్స్’ ద్వారా జన్యు, రక్త, మూత్ర పరీక్షలను ప్రత్యేక బృందాలతో నిర్వహిస్తున్నాం. ఇందుకు ICMR ₹6.2CR ఇచ్చింది. వ్యాధి వచ్చే అవకాశాలను ముందే గుర్తించి నివారణ చర్యలు తీసుకుంటున్నాం. పలాస రీసెర్చ్ కేంద్రం సహా విశాఖ KGHలో ప్రత్యేక ల్యాబ్‌లు నెలకొల్పాం’ అని తెలిపారు.

News April 14, 2026

20 ఏళ్ల పాటు సీఎం.. నేటితో ముగిసిన శకం

image

బిహార్‌లో దాదాపు 20 ఏళ్ల పాటు CMగా కొనసాగిన నితీశ్ <<19649099>>శకం<<>> నేటితో ముగిసింది.
*తొలిసారి 2000లో 7 రోజులు
*2005-10 వరకు 1,827 రోజులు
*2010-14 వరకు 1,270 రోజులు
*2015లో 270 రోజులు
*2015 నుంచి 2017 వరకు 614 రోజులు
*2017 జులై నుంచి 2020 వరకు 1,204 రోజులు
*2020 NOV నుంచి 2022 వరకు 631 రోజులు
*2022 AUG నుంచి 2024 వరకు 536 రోజులు
*2024 నుంచి 2025 వరకు 661 రోజులు
*2025 NOV నుంచి 2026 APR వరకు 146 రోజులు

News April 14, 2026

రోబోలతోనే రష్యా స్థావరాన్ని దక్కించుకున్న ఉక్రెయిన్!

image

2022 నుంచి రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్ ఇప్పుడు బరిలో రోబోలను నిలిపి మిషన్స్ చేపడుతోంది. ఈ క్రమంలో తొలిసారిగా జవాన్లు లేకుండానే రోబోలతో ఓ రష్యా స్థావరాన్ని అదుపులోకి తీసుకున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వెల్లడించారు. గత మూడు నెలల్లో ఈ గ్రౌండ్ వెహికల్స్ 22వేలకుపైగా మిషన్స్ చేపట్టాయని తెలిపారు. టెక్నాలజీతో ప్రాణనష్టం తగ్గించొచ్చనడానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు.