News December 26, 2024
నిమిషానికి 158 బిర్యానీలు తినేశారు!
సంతోషంలో ఉన్నా, బాధలో ఉన్నా, పండుగొచ్చినా బిర్యానీలు తినాల్సిందే అన్నట్లుగా మారిపోయింది. ఆర్డర్ చేస్తే ఇంటికే బిర్యానీ వస్తుండటంతో స్విగ్గీ బుకింగ్స్‌లో బిర్యానీ <<14970078>>టాప్‌లో<<>> నిలిచింది. ఈ ప్లాట్‌ఫామ్‌లో ఈ ఏడాది నిమిషానికి ఏకంగా 158 బిర్యానీలు బుక్ అయ్యాయి. 2023లో ఈ సంఖ్య 150గా ఉండగా 2022లో 137, 2021లో 115, 2020లో నిమిషానికి 90 బిర్యానీల ఆర్డర్లు వచ్చేవి. ఏటా బుకింగ్స్ సంఖ్య పెరుగుతూనే ఉంది.
Similar News
News December 27, 2024
మన్మోహన్ అరుదైన ఫొటోలు.. గ్యాలరీ
మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్(92) తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో ఆయనకు సంబంధించిన జ్ఞాపకాలను నెటిజన్లు గుర్తుచేసుకుంటున్నారు. మన్మోహన్ అరుదైన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
News December 27, 2024
10 ఏళ్లు ప్రధాని.. రెండు ఫ్లాట్లు, మారుతి 800 కారు
తనకు రూ.15.77 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని మన్మోహన్ సింగ్ 2018లో రాజ్యసభ సీటుకు నామినేషన్ సందర్భంగా వెల్లడించారు. ఢిల్లీ, చండీగఢ్‌లో రెండు ఫ్లాట్లు, మారుతి 800 కారు, SBI, పోస్టల్ బ్యాంకులో డిపాజిట్లు ఉన్నాయని అఫిడవిట్ సమర్పించారు. ఎలాంటి అప్పులు లేవని పేర్కొనడం మన్మోహన్ ఆర్థిక క్రమశిక్షణకు నిదర్శనం.
News December 27, 2024
మన్మోహన్ మృతి.. ఇవాళ సెలవు
TG: మాజీ ప్రధాని మన్మోహన్ మృతి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ప్రభుత్వ కార్యాలయాలు, అన్ని విద్యాసంస్థలకు ఇవాళ సెలవు ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. వారం రోజులపాటు సంతాప దినాలుగా నిర్వహించాలని సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులిచ్చారు. మరోవైపు కర్ణాటక ప్రభుత్వం కూడా సెలవు ప్రకటించింది.