News November 9, 2025
15L టన్నుల చక్కెర ఎగుమతికి గ్రీన్‌సిగ్నల్?

2025-26లో 15L టన్నుల చక్కెర ఎగుమతులను అనుమతించాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది. మొలాసిస్(చక్కెర తయారీలో ఏర్పడే ద్రవం)పై 50% ఎగుమతి సుంకాన్ని ఎత్తేస్తుందని సమాచారం. దీనివల్ల మిల్లులకు లాభాలు, రైతులకు వేగంగా చెల్లింపులు జరుగుతాయని భావిస్తోంది. వచ్చే సీజన్‌లో చక్కెర ఉత్పత్తి 18.5% పెరిగి 30.95M టన్నులకు చేరుతుందని అంచనా. ఇథనాల్ ఉత్పత్తికి 34L టన్నులు వినియోగించినా భారీగా మిగులు ఉండనుంది.
Similar News
News November 9, 2025
GWL: టీబీ డ్యామ్ ఆయకట్టుకు డిసెంబర్ 20 వరకు సాగునీరు

కర్ణాటక రాష్ట్రం హోస్పేట్ వద్ద ఉన్న తుంగభద్ర డ్యామ్‌కు నూతన గేట్లు అమర్చేందుకు ఇరిగేషన్ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు టీబీ డ్యామ్ పరిధిలోని ఆయకట్టుకు డిసెంబర్ 20 వరకు మాత్రమే సాగునీరు అందిస్తామని తెలిపారు. రబీలో క్రాప్ హాలిడే ప్రకటించి కొత్త గేట్లు అమర్చుతామని తెలిపారు. విషయాన్ని ఆయకట్టు రైతులు గ్రహించి సహకరించాలన్నారు. ఈ విషయమై 3 రాష్ట్రాల ఇరిగేషన్ అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
News November 9, 2025
అనుపమ ఫొటోలు మార్ఫింగ్.. చేసింది ఎవరో తెలిసి షాకైన హీరోయిన్

తన ఫొటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేయడంపై హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ పోలీసులను ఆశ్రయించారు. విచారణలో తమిళనాడుకు చెందిన 21 ఏళ్ల అమ్మాయే ఆ పని చేస్తున్నట్లు తెలిసి షాక్ అయినట్లు ఆమె తెలిపారు. ఇన్‌స్టాలో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి మార్ఫ్‌డ్ ఫొటోలు, అసభ్యకర కంటెంట్‌తో తన ఇమేజ్‌ను దెబ్బతీసిందన్నారు. సదరు అమ్మాయిపై లీగల్ చర్యలకు సిద్ధమైనట్లు అనుపమ చెప్పారు.
News November 9, 2025
ఈ వైరస్‌తో బెండ పంటకు తీవ్ర నష్టం

బెండ పంటను ఆశించే చీడపీడల్లో ‘ఎల్లో వీన్ మొజాయిక్ వైరస్’ ప్రధానమైనది. ఈ వైరస్ ఉద్ధృతి పెరిగితే పంట పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది. ఇది ప్రధానంగా తెల్లదోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది. మొజాయిక్ వైరస్ సోకిన మొక్కల ఆకులపై పసుపుపచ్చని మచ్చలు లేదా చారలు ఏర్పడతాయి. ఆకుల ఆకారం మారుతుంది. కాండంపై మచ్చలు కనిపిస్తాయి. మొక్కల ఎదుగుదల, కాయల నాణ్యత తగ్గుతుంది. ఈ వైరస్ ఒక మెుక్క నుంచి ఇతర మొక్కలకు వ్యాపిస్తుంది.


