News April 4, 2025

15th ఫైనాన్స్‌కు మహబూబ్‌నగర్ కార్పొరేషన్ ఎంపిక

image

కేంద్ర ప్రభుత్వం మున్సిపల్ కార్పొరేషన్లకు గ్రాంట్లు ఇచ్చేందుకు ప్రవేశపెట్టిన 15వ ఫైనాన్స్‌కు ఈసారి మన మహబూబ్‌నగర్ నగరపాలక సంస్థ ఎంపికైంది. ఈ ఎంపికను ఆస్తి పన్నులను 21 శాతం వసూలు చేయడంతో కేంద్ర ప్రభుత్వం పాలమూరుకు అవకాశం కల్పించింది. ఇక నేడో రేపో మహబూబ్‌నగర్ నగర పాలక సంస్థకు రూ.30 కోట్ల గ్రాంట్స్‌ని కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. దీంతో పట్టణంలో అభివృద్ధి పనులు వేగవంతం కానున్నాయి.

Similar News

News April 18, 2025

NZB: దాశరథి పురస్కారానికి జిల్లా వాసి ఎంపిక

image

నిజామాబాద్ జిల్లాకు చెందిన కవి, ఉపాధ్యాయుడు ప్రేమ్ లాల్‌ ప్రతిష్ఠాత్మక దాశరథి పురస్కారానికి ఎంపికయ్యాడు. సాహిత్య రంగంలో ఆయన చేస్తున్న కృషిని గుర్తించి ఈ పురస్కారాన్ని ప్రధానం చేయనున్నారు. ఈ విషయాన్ని రావు ఆర్గనైజేషన్ కన్వీనర్ సతీశ్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మే 1న హైదరాబాద్‌లో పురస్కార ప్రధాన కార్యక్రమం ఉంటుందన్నారు.

News April 18, 2025

వినూత్నంగా కేఎల్ రాహుల్ కూతురు పేరు

image

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్, ఆయన సతీమణి అతియా శెట్టి ఇటీవల కూతురుకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఇవాళ రాహుల్ బర్త్‌డే సందర్భంగా అతియా ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చారు. తమ పాపకు ‘ఇవారా విపులా రాహుల్’ అని పేరు పెట్టినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇవారా అంటే అర్థం ‘దేవుడి బహుమతి’ అని పేర్కొన్నారు. పాప ‘నానీ’ గౌరవార్థం విపులా అని పెట్టినట్లు తెలిపారు.

News April 18, 2025

సిరిసిల్ల: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు రూ.లక్ష పంపిణీ 

image

సిరిసిల్ల జిల్లాలో బేస్మెంట్ వరకు ఇంటి నిర్మాణం పూర్తి చేసుకున్న 24 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు రూ.లక్ష నిధులు విడుదల చేసిందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా శుక్రవారం తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ప్రభుత్వం ప్రతి మండలంలో పైలెట్ ప్రాజెక్టు కింద ఒక గ్రామాన్ని ఎంపిక చేసి అర్హులకు మంజూరు పత్రాలు పంపిణీ చేసిందన్నారు. ప్రాజెక్టు కింద పైలెట్ ప్రాజెక్టుకింద మొత్తం1023 ఇళ్లు మంజూరు చేశామన్నారు. 

error: Content is protected !!