News July 15, 2024
16న ఖమ్మంకు రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాక

ఈ నెల 16న ఖమ్మానికి రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు రానున్నట్లు జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రకటనలో తెలిపారు. చైర్మన్గా బాధ్యతలు స్వీకరించి మొదటిసారిగా ఖమ్మం వస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనకు నగరంలోని వివిసి ఫంక్షన్ హాల్ (మామిళ్లగూడెం) నందు సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ విషయాన్ని పార్టీ శ్రేణులు గమనించాలని పేర్కొన్నారు.
Similar News
News December 3, 2025
ఖమ్మం సర్కారీ స్కూళ్ల అద్భుత ప్రదర్శన, కలెక్టర్ ప్రశంసలు

ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ విద్య ఉన్నత లక్ష్యాలను చేరుకోవడానికి ఉపాధ్యాయుల కృషి, విద్యార్థుల నైపుణ్యాలు తోడవ్వాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. స్వచ్ఛ హరిత విద్యాలయాల సర్వేలో అద్భుత ప్రతిభ కనబరిచి, అత్యధిక స్కోర్ సాధించిన 8 ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు కలెక్టర్ ప్రశంసపత్రాలు అందించి అభినందించారు. ఈ విజయం జిల్లాకు గర్వకారణం అని కలెక్టర్ తెలిపారు.
News December 3, 2025
ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి 29 మంది సీనియర్ రెసిడెంట్లు

ఖమ్మం జిల్లా ప్రభుత్వ మెడికల్ కళాశాల అనుబంధ ఆసుపత్రికి డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ శుభవార్త అందించింది. తాజాగా 29 మంది సీనియర్ రెసిడెంట్లను కేటాయించింది. పీజీ పూర్తి చేసిన ఈ నిపుణులైన వైద్యులు, సంవత్సరం పాటు అత్యవసర విభాగాలతో సహా జనరల్ ఆసుపత్రిలోని వివిధ విభాగాల్లో సేవలు అందిస్తారు. ఈ నియామకాలతో ఖమ్మం ప్రజలకు మరింత నాణ్యమైన వైద్యం అందుబాటులోకి రానుంది.
News December 3, 2025
ఖమ్మం: నేటి నుంచి మూడో విడత నామినేషన్ల పర్వం

స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మూడో విడత నామినేషన్ల స్వీకరణ నేటి(బుధవారం) నుంచి ప్రారంభం కానుంది. జిల్లాలోని ఏన్కూరు, కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి, తల్లాడ, వేంసూరు, సింగరేణి సహా మొత్తం 7 మండలాల్లో అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేయవచ్చు. ఈ విడతలో మొత్తం 191 గ్రామ పంచాయతీలు, 1,742 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్లను ఈ నెల 5 వరకు స్వీకరిస్తారని అధికారులు తెలిపారు.


