News October 14, 2024

16న విశాఖలో జడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు

image

విశాఖ జిల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాలు ఈ నెల 16వ తేదీన నిర్వహించనున్నట్లు జడ్పీ సీఈవో నారాయణమూర్తి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జడ్పీ ఛైర్పర్సన్ సుభద్ర అధ్యక్షతన జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఒకటి నుంచి ఏడు వరకు గల స్థాయిూ సంఘ సమావేశాలు వేరువేరుగా ఉదయం 10 నుంచి 12 గంటల వరకు జరుగుతాయన్నారు. జడ్పీటీసీలు, ఎంపీపీలు సమావేశానికి హాజరు కావాలని కోరారు.

Similar News

News November 12, 2024

విశాఖలో పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య

image

గోపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఎల్లపువానిపాలెంలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థి నిఖిల్ ఈశ్వర్ రావు(16) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటిలో ఎవరు లేని సమయంలో ఆత్మహత్య చేసుకున్నాడు. కడుపు నొప్పి తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. గోపాలపట్నం పోలీసులు మంగళవారం ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News November 12, 2024

విశాఖ: వరకట్న వేధింపులతో వివాహిత సూసైడ్

image

వరకట్న వేధింపులతో విశాఖలో ఓ వివాహిత సూసైడ్ చేసుకుంది. 4వ టౌన్ పోలీసల వివరాల ప్రకారం.. దిల్లేశ్వరి అక్కయ్యపాలేనికి చెందిన రాజశేఖర్‌ని పెళ్లిచేసుకుంది. వ్యాపారం కోసం డబ్బులు కావాలని భర్త వేధించడంతో పుట్టింటి నుంచి రూ.6 లక్షలు తెచ్చింది. అయినప్పటికీ హింసించడంతో ఆదివారం సూసైడ్ చేసుకుంది. దిల్లేశ్వరి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేసి ఆమె భర్త, అత్తపై కేసు నమోదు చేశారు.

News November 12, 2024

బడ్జెట్‌లో విశాఖకు ఎన్ని వందల కోట్లు ఇచ్చారంటే?

image

సోమవారం జరిగిన ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌లో విశాఖ జిల్లాకు కేటాయించిన నిధుల వివరాలు ఇవే..
⁍ ఆంధ్రా యూనివర్సిటీకి రూ.389.34 కోట్లు
⁍ స్మార్ట్ సిటీలో భాగంగా GVMCకి రూ.20 కోట్లు
⁍విశాఖ- చెన్నై పారిశ్రామిక కారిడార్‌కు రూ.210.91 కోట్లు
⁍ మేహాద్రి గెడ్డలో సోలార్ పవర్‌కు రూ.6 కోట్లు
⁍ ప్రాంతీయ గ్రంథాలయం అభివృద్ధికి రూ.50 లక్షలు
⁍ విశాఖలో పోలీస్ స్టేషన్‌‌లకు రూ.58 కోట్లు
⁍ బాలుర వసతి గృహానికి రూ.42 లక్షలు