News May 12, 2024
16వ తేదీ నుంచి డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు

రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు ఈనెల 16వ తేదీ నుంచి నిర్వహిస్తున్నట్లు వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ వెంకటేశ్వర్లు తెలిపారు. వర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ బీ.సుధీర్ ప్రేమ్ కుమార్ ఆదేశాల మేరకు డిగ్రీ 2, 4వ సెమిస్టర్ రెగ్యులర్/సప్లిమెంటరీ, 6వ సెమిస్టర్ సప్లిమెంటరీ, డిగ్రీ స్పెషల్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News January 19, 2026
కర్నూలు జిల్లా జనరల్ సెక్రటరీగా సుందర్ రాజు నియామకం

సమాచార హక్కు చట్టం–2005 కర్నూలు జిల్లా జనరల్ సెక్రటరీగా ఆదోని వాసి కె.సుందర్‌రాజును జిల్లా అధ్యక్షుడు కిశోర్ సోమవారం నియమించారు. సుందర్‌రాజు మాట్లాడుతూ.. ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచారం పొందే హక్కు ప్రతి భారత పౌరుడికి ఉందన్నారు. అవినీతిని నిర్మూలించి పారదర్శకత, జవాబుదారితనాన్ని పెంచడంలో ఆర్టీఐ చట్టం ఎంతో ఉపయుక్తమన్నారు. చట్ట సభ్యులపై దాడులకు పాల్పడితే సెక్షన్ 6(j) ప్రకారం కేసులు నమోదవుతాయన్నారు.
News January 19, 2026
వాట్సాప్‌లోనే FIR కాపీ.. స్టేషన్లకు వెళ్లక్కర్లేదు!

మద్దికేర పోలీస్ స్టేషన్ పరిధిలోని FIR వివరాలు ఇకపై వాట్సాప్ ద్వారా సులభంగా పొందవచ్చని SI హరిత ఆదివారం తెలిపారు. 9552300009 నంబర్‌కు మెసేజ్ పంపి, మెనూలో పోలీస్ విభాగాన్ని ఎంచుకుని కేస్ నంబర్ ఎంటర్ చేస్తే ఉచితంగా కాపీ లభిస్తుందన్నారు. దీనివల్ల ప్రజలు స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన పనిలేదని పేర్కొన్నారు. ఈ నూతన విధానంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News January 18, 2026
కర్నూలులో బహిరంగ హెచ్చరిక బ్యానర్లు

కర్నూలు నగరంలో ఆస్తిపన్ను మొండి బకాయిల వసూళ్లను నగరపాలక సంస్థ మరింత కఠినతరం చేస్తోంది. ఈక్రమంలో ‘మేలుకో బకాయిదారుడా!’ అనే శీర్షికతో ఆదివారం హెచ్చరికాత్మక బ్యానర్లను పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. ఈ చర్యలతో అయినా బకాయిదారుల్లో చైతన్యం వచ్చి, స్వచ్ఛందంగా పన్నులు చెల్లించే పరిస్థితి ఏర్పడుతుందన్న ఆశతో అధికారులు ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే మొండి బకాయిదారుల పట్ల అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు.


