News August 13, 2024
16 నుంచి రెవెన్యూ సదస్సులు ప్రారంభం

భూ సంబంధిత సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించే లక్ష్యంతో ఈ నెల 16 నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు మంత్రి స్వామి అన్నారు. ఒంగోలులోని కలెక్టరేట్ కార్యాలయంలో రెవెన్యూ సమస్యలపై కలెక్టర్ తమీమ్ అన్సారీయ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి పాల్గొని మాట్లాడుతూ.. జిల్లాలో రెవెన్యూ సదస్సు 45 రోజులు పాటు జరుగుతుందని చెప్పారు. రెవెన్యూ సమస్యలపై దృష్టి సారించినట్లు తెలిపారు.
Similar News
News February 27, 2026
మార్కాపురం జిల్లాలో అధికారి సస్పెండ్

మార్కాపురం జిల్లాలో ఓ ప్రభుత్వ అధికారి సస్పెండ్ అయ్యారు. వివరాల్లోకి వెళితే.. పుల్లలచెరువు మండలం చాపలమడుగు పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీనివాసరావును సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ రాజాబాబు ఉత్తర్వులు ఇచ్చారు. గ్రామ పంచాయతీ నిధులు అక్రమంగా దుర్వినియోగం చేశారనే అభియోగంతో డిప్యూటీ MPDO విచారణ చేపట్టారు. నివేదిక ఆధారంగా శ్రీనివాసరావును సస్పెండ్ చేస్తూ చర్యలు తీసుకోవాలని MPDOని కలెక్టర్ ఆదేశించారు.
News February 27, 2026
కనిగిరి ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులు హత్య చేశారు.!

గాలివీడులో <<19248603>>ఈ నెల 17న జరిగిన హత్య కేసులో<<>> నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. భూవివాదాలు, అన్నదమ్ముల మధ్య వర్గపోరే ఈ హత్యకు కారణమని డీఎస్పీ కృష్ణమోహన్ తెలిపారు. ఈ హత్యలో కనిగిరి ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థి పెద్దారెడ్డి కూడా ఉన్నట్లు గుర్తించారు. ఇతనితో పాటు నిందితులు ప్రొద్దుటూరుకు చెందిన కుళాయప్ప, కనిగిరికి చెందిన తిరుపతి రెడ్డి, విశ్వనాధరెడ్డి, మహేశ్వర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.
News February 26, 2026
మార్కాపురంలో సీఎంను ఆకట్టుకున్న విద్యార్థిని చిత్రలేఖనం

మార్కాపురం బహిరంగ సభలో ఓ విద్యార్థిని గీసిన చిత్రలేఖనం సీఎం చంద్రబాబును ప్రత్యేకంగా ఆకట్టుకుంది. మార్కాపురం జిల్లా చెన్నకేశవ స్వామి గోపురం, సీఎం చిత్రాల అందంగా ఉండడంతో విద్యార్థినిని సీఎం అభినందించారు. ఈ చిత్రలేఖనంలో చాలా అర్థం దాగి ఉందని ప్రజలకు వివరించారు. ఆ దేవుడితో పెట్టుకుంటే పతనం ఖాయమని హెచ్చరించారు.


