News December 22, 2025
16 సోమవారాల వ్రతం.. ఎలా చేయాలి?

ఉదయాన్నే స్నానమాచరించాలి. శివలింగానికి గంగాజలం, పంచామృతాలతో అభిషేకం చేయాలి. పూజలో బిల్వపత్రాలు, తెల్లటి పుష్పాలు, ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి. వ్రత కథను చదివి రోజంతా ‘ఓం నమః శివాయ’, ‘మహామృత్యుంజయ’ మంత్రాన్ని జపించాలి. ఉపవాసం ఉండేవారు పాలు, పండ్లు తీసుకోవచ్చు. సాయంత్రం చంద్ర దర్శనం తర్వాత ఉపవాసం విరమించాలి. ఈ వ్రతం వల్ల మానసిక ప్రశాంతత, అన్యోన్య దాంపత్యం, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి.
Similar News
News December 25, 2025
HUDCOలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

ఢిల్లీలోని హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (<
News December 25, 2025
PHOTOS: జగన్ క్రిస్మస్ వేడుకలు

AP: పులివెందుల పర్యటనలో ఉన్న YCP చీఫ్ జగన్ ఫ్యామిలీతో కలిసి స్థానిక CSI చర్చ్‌లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. ప్రత్యేక ప్రార్థనలు చేసి అందరితో కలిసి కేక్ కట్ చేశారు. తల్లి విజయమ్మ ఆయనను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టారు. జగన్‌ను చూసేందుకు వైసీపీ కార్యకర్తలు, స్థానికులు పెద్ద ఎత్తున చర్చ్ ప్రాంగణానికి చేరుకున్నారు. వారందరికీ జగన్ అభివాదం చేసుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
News December 25, 2025
మతం, ధర్మం.. రెండూ ఒకటేనా?

వీటి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. మతం ఓ నిర్దిష్ట దైవాన్ని పూజించే పద్ధతి. ఇది గ్రంథం, నమ్మకాల చుట్టూ తిరుగుతుంది. ఇది మనుషులు ఏర్పాటు చేసుకున్న ఓ వ్యవస్థ. కానీ ధర్మం అనేది విశ్వవ్యాప్తమైనది. ‘ధరించునది’ అని దీని అర్థం. అంటే సత్యం, అహింస, బాధ్యత, మానవత్వాన్ని పాటించడం. మతం మారవచ్చు కానీ ధర్మం (ఉదాహరణకు: తల్లిగా ధర్మం, మనిషిగా ధర్మం) ఎప్పటికీ మారదు. మతం వ్యక్తిగతమైనది. ధర్మం సామాజికమైన క్రమశిక్షణ.


