News October 22, 2024
హరియాణాలో 16మంది రైతుల అరెస్టు

పంట వ్యర్థాలు కాలుస్తున్న 16మంది రైతుల్ని హరియాణా పోలీసులు ఈరోజు అరెస్ట్ చేశారు. ఏటా శీతాకాలంలో ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత దారుణ స్థాయికి చేరుకుంటోంది. పంజాబ్, హరియాణా రైతులు పంటవ్యర్థాలు కాల్చడం దీనికి ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో చట్ట విరుద్ధంగా పంట వ్యర్థాలను కాలుస్తున్న రైతుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెయిలబుల్ అఫెన్స్ కావడంతో వెంటనే బెయిల్ లభించినట్లు వారు తెలిపారు.
Similar News
News February 4, 2026
క్రికెట్లో మార్పు.. ఆఖరి ఓవర్లో అవుటైనా..

క్రికెట్ రూల్స్ నిర్ణయించే MCC మరో కీలక మార్పు చేసింది. టెస్టుల్లో ఇంతకుముందు రోజులో చివరి ఓవర్లో ఏదైనా బంతికి బ్యాటర్ అవుటైతే అక్కడే ఆ రోజు ఆట ఆపివేసేవారు. మిగతా బంతులను బౌలర్ తర్వాతి రోజు వేసేవారు. తాజాగా MCC దాన్ని సవరించింది. బ్యాటర్ అవుటైనా ఆఖరి ఓవర్ పూర్తి చేస్తేనే ఆ రోజు ఆట ముగుస్తుందని తెలిపింది. వికెట్ పడగానే మ్యాచ్‌ను ఆపడం వల్ల ఆటలో డ్రామాను కోల్పోతున్నామని పేర్కొంది.
News February 4, 2026
వరిలో పాముపొడ(మాగుడు) తెగులు – నివారణ

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గాలిలో తేమ వల్ల వరిలో పాముపొడ తెగులు ఉద్ధృతి పెరిగే అవకాశం ఉంది. వరి దుబ్బు చేసే దశలో ఇది వ్యాపిస్తుంది. వరి కాండం, ఆకులపై పాము పొడ లాంటి మచ్చలు కనిపిస్తాయి. తెగులు తీవ్రమైతే మొక్కలు ఎండి, తాలు గింజలు ఏర్పడతాయి. దీని నివారణకు ఎకరానికి 200 లీటర్ల నీటిలో 400ml హెక్సాకొనజోల్ 5 SP లేదా 400ml వాలిడామైసిన్ 3 SL లేదా 200ml ప్రోపికొనజోల్ 25% EC కలిపి పిచికారీ చేయాలి.
News February 4, 2026
త్వరలో దూత-2 వెబ్‌సిరీస్?

కార్తీక్ దండు-నాగ చైతన్య కాంబోలో తెరకెక్కుతున్న ‘వృషకర్మ’ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీంతో దూత-2 వెబ్‌సిరీస్‌పై చైతూ ఫోకస్ పెట్టినట్లు సమాచారం. డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ స్క్రిప్ట్‌ను పూర్తి చేశారని తెలుస్తోంది. ప్రీప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయని టాక్. త్వరలోనే షూటింగ్ ప్రారంభించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. 2023లో విడుదలైన దూత వెబ్ సిరీస్ హిట్టయిన విషయం తెలిసిందే.


