News December 24, 2024
తిరుమల శ్రీవారి దర్శనానికి 16 గంటల టైమ్

AP: తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 28 కంపార్ట్‌మెంట్లలో వేంకటేశ్వరస్వామి దర్శనానికి వేచి ఉన్నారు. నిన్న మలయప్పస్వామిని 65,656 మంది దర్శించుకోగా, 24,360 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.15 కోట్లు వచ్చినట్లు దేవస్థానం వెల్లడించింది. అటు, రూ.300 ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది.
Similar News
News September 19, 2025
దసరా స్పెషల్ బస్సుల్లో ఛార్జీలు పెంపు!

TG: దసరా <<17751389>>స్పెషల్ బస్సుల్లో<<>> సవరించిన ఛార్జీలు అమల్లో ఉంటాయని RTC ప్రకటించింది. దీంతో టికెట్ ధర 50% పెరిగే అవకాశం ఉంది. ఈ నెల 20, 27-30, అక్టోబర్ 1, 5, 6 తేదీల్లో నడిచే స్పెషల్ బస్సుల్లో ఈ సవరణ ఛార్జీలు అమల్లో ఉంటాయి. రెగ్యులర్ సర్వీసుల ఛార్జీల్లో మార్పు ఉండదని సంస్థ తెలిపింది. 2003లో ప్రభుత్వం జారీ చేసిన GO 16 ప్రకారం స్పెషల్ బస్సులకు ఛార్జీలు సవరిస్తున్నట్లు RTC గతంలో పలుమార్లు వివరణ ఇచ్చింది.
News September 19, 2025
ఈనెల 22 నుంచి డిగ్రీ కాలేజీలు బంద్

AP: రాష్ట్రంలో ప్రైవేటు డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. ఫీజు బకాయిలు చెల్లించకపోతే ఈనెల 22 నుంచి కాలేజీలు మూసేస్తామంటూ ప్రభుత్వానికి సమ్మె నోటీసులిచ్చాయి. 16నెలలుగా ఫీజు బకాయిలు పెట్టడంతో ఉద్యోగులకు జీతాలివ్వలేక, కళాశాలలు నిర్వహించలేక ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొన్నారు. తొలుత రెండు యూనియన్లు బంద్ నిర్ణయం తీసుకోగా.. దసరా సెలవుల నేపథ్యంలో ఓ యూనియన్ నిర్ణయాన్ని వాయిదా వేసింది.
News September 19, 2025
నేటి అసెంబ్లీ అప్‌డేట్స్

AP: నేడు ఉ.10 గం.కు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మెడికల్ కాలేజీలపై వైసీపీ వాయిదా తీర్మానం ఇవ్వనుంది. మధ్యాహ్నం బనకచర్ల, ఇరిగేషన్ ప్రాజెక్టులపై చర్చ జరగనుంది. మధ్యాహ్నం 2 గం.కు క్యాబినెట్ సమావేశమై సభలో ప్రవేశపెట్టే బిల్లులకు ఆమోదం తెలపనుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ చట్ట సవరణ ఆర్డినెన్స్‌ను ప్రవేశపెట్టనున్నారు.