News July 21, 2024
చాందీపురా వైరస్ సోకి 16 మంది మృతి

గుజరాత్లో చాందీపురా <<13646193>>వైరస్<<>> కలకలం రేపుతోంది. ఈ వైరస్ సోకి ఇప్పటివరకు 16 మంది మరణించినట్లు ఆరోగ్య మంత్రి రుషికేశ్ పటేల్ తెలిపారు. మరో 50 కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వైరస్ ప్రభావం ఉన్నట్లు తెలిపారు. పరిస్థితిపై అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు చెప్పారు.
Similar News
News November 18, 2025
రేపటి నుంచి ఇందిరమ్మ చీరలు పంపిణీ: సీఎం రేవంత్

TG: ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని రేపటి నుంచి మహిళలకు చీరల పంపిణీ చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. HYD నెక్లెస్ రోడ్లోని ఇందిరా విగ్రహం వద్ద మ.12 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభించనున్నారు. రేపటి నుంచి డిసెంబర్ 9వరకు గ్రామీణ ప్రాంతాల్లో, మార్చి 1 నుంచి 8 వరకు పట్టణాల్లో మొత్తంగా కోటి మందికి రెండు విడతల్లో చీరలు పంపిణీ చేస్తామని పేర్కొన్నారు.
News November 18, 2025
INDIA హసీనాను బంగ్లాకు అప్పగించకపోవచ్చు!

నిరసనల అణచివేతకు ఆదేశాలిచ్చి పలువురి మృతికి కారణమయ్యారనే ఆరోపణలతో దేశాన్ని వీడిన PM హసీనాకు బంగ్లా కోర్టు ఉరిశిక్ష విధించడం తెలిసిందే. నేరారోపణలున్న ఆమెకు ఆశ్రయం తగదని ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం వెంటనే అప్పగించాలని ఆ దేశం ఇండియాను హెచ్చరించింది. అయితే అందుకు అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. ఆర్టికల్ 8, 29 ప్రకారం రాజకీయ ప్రేరేపిత, న్యాయ విరుద్ధ అభ్యర్థనను తోసిపుచ్చే అధికారం ఇండియాకు ఉంది.
News November 18, 2025
నీటి వాడుక లెక్కలు తేల్చేందుకు AP సహకరించడం లేదు: ఉత్తమ్

కృష్ణా జలాల వినియోగాన్ని తెలుసుకొనేలా టెలిమెట్రీ స్టేషన్ల ఏర్పాటుకు AP సహకరించడం లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ‘నీటిని ఏ రాష్ట్రం ఎంత వినియోగిస్తోందో తెలుసుకొనేందుకు 18 టెలిమెట్రీ స్టేషన్లు ఏర్పాటుచేశాం. మరో 20 ఏర్పాటుకావాలి. వీటి ఏర్పాటుకు ఏపీ ముందుకు రావడం లేదు. తన వాటా నిధులూ ఇవ్వడం లేదు. స్టేషన్ల ఏర్పాటుకు ఆ నిధులనూ మేమే ఇస్తామని కేంద్రానికి చెప్పా’ అని ఉత్తమ్ పేర్కొన్నారు.


