News November 15, 2025

160 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తే లక్ష్యం: CM

image

CII సమ్మిట్‌లో సెంటర్ ఫర్ ఎనర్జీ, సైబర్ రెజిలియన్స్ కేంద్రం ఏర్పాటుకు CM చంద్రబాబు సమక్షంలో AP ప్రభుత్వంతో వరల్డ్ ఎకనామిక్ ఫోరం MOU కుదుర్చుకుంది. 160 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీని APలో ఉత్పత్తి చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు CM పేర్కొన్నారు. AI లాంటి టెక్నాలజీ వినియోగం ద్వారా విద్యుత్ పంపిణీ నష్టాలు, సరఫరా వ్యయం తగ్గించాలని ఆయన సూచించారు. నాణ్యమైన, తక్కువ వ్యయంతో విద్యుత్ సరఫరా చేయాల్సి ఉందన్నారు.

Similar News

News November 15, 2025

రైల్ వీల్ ఫ్యాక్టరీలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు

image

బెంగళూరులోని <>రైల్<<>> వీల్ ఫ్యాక్టరీ స్పోర్ట్స్ కోటాలో 15 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్, కబడ్డీ, ఫుట్‌బాల్, చెస్‌లో పతకాలు సాధించినవారు ఈనెల 29వరకు అప్లై చేసుకోవచ్చు. టెన్త్, ITI, ఇంటర్‌ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయసు 18- 25ఏళ్ల మధ్య ఉండాలి. వెబ్‌సైట్: https://rwf.indianrailways.gov.in/

News November 15, 2025

బాపట్ల జిల్లా టూరిజంకు ప్రసిద్ధి: కలెక్టర్

image

బాపట్ల జిల్లా టూరిజంకు ప్రసిద్ధి చెందిందని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అన్నారు. జిల్లాలో సూర్యలంక బీచ్, రామాపురం బీచ్‌లకు ఎక్కువగా పర్యాటకులు వస్తుంటారని, అక్కడ రిసార్ట్‌లు బాగా అభివృద్ధి చెందాయని, పరిసరాలను ఎల్లవేళలా పరిశ్రమంగా ఉంచి, పర్యాటకులను ఆకర్షించాలన్నారు. పర్యాటకులు ఎక్కువగా జిల్లాకు వచ్చినప్పుడు ఆదాయం పెరుగుతుందని తద్వారా జీడీపీ రేటు పెరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.

News November 15, 2025

మూవీ ముచ్చట్లు

image

* Globetrotter ఈవెంట్‌లో SSMB29 టైటిల్ వీడియో ప్లే అయ్యాక ఆన్‌లైన్‌లో రిలీజ్ చేస్తాం: రాజమౌళి
* రజినీకాంత్ హీరోగా తాను నిర్మిస్తున్న ‘తలైవర్ 173’ మూవీ నుంచి డైరెక్టర్ సి.సుందర్ తప్పుకున్నట్లు ప్రకటించిన కమల్ హాసన్
* దుల్కర్ సల్మాన్-భాగ్యశ్రీ బోర్సే కాంబోలో వచ్చిన ‘కాంత’ చిత్రానికి తొలిరోజు రూ.10.5 కోట్ల గ్రాస్ కలెక్షన్స్
* రోజుకు 8 గంటల పని శరీరానికి, మనసుకు సరిపోతుంది: దీపికా పదుకొణె