News October 6, 2025
NLC ఇండియా లిమిటెడ్‌లో 163 పోస్టులు

NLC ఇండియా లిమిటెడ్ 163 అప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఐటీఐ ట్రేడ్, డిప్లొమా, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ కోసం ఈ నెల 23వరకు అప్లై చేసుకోవచ్చు. హార్డ్ కాపీని ఈ నెల 30 వరకు పంపించాలి. అకడమిక్ మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అభ్యర్థులు ముందుగా NATS/NAPS పోర్టల్‌లో ఎన్‌రోలింగ్ కావాలి. వెబ్‌సైట్: https://www.nlcindia.in/
Similar News
News October 6, 2025
కాంతార ఛాప్టర్-1: నాలుగు రోజుల్లో రూ.310 కోట్లు!

రిషబ్ శెట్టి, రుక్మిణి వసంత్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘కాంతార ఛాప్టర్-1’ మూవీ థియేటర్లలో భారీ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. విడుదలైన నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.310 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు సినీ వర్గాలు తెలిపాయి. నిన్న రూ.65 కోట్లకుపైగా కలెక్ట్ చేసిందని పేర్కొన్నాయి. అటు బుక్ మై షోలో నిన్న మధ్యాహ్నం వరకు 50 లక్షలకుపైగా టికెట్లు అమ్ముడుపోయాయని మూవీ యూనిట్ పేర్కొంది.
News October 6, 2025
అధిక వర్షాలు.. కూరగాయ పంటల్లో జాగ్రత్తలు

భారీ వర్షాల సమయంలో పొలంలో నిలిచిన నీటిని సాధ్యమైనంత త్వరగా బయటకు పంపేలా చూసుకోవాలి. లేకుంటే పంటకు తీవ్ర నష్టం జరుగుతుంది. వర్షాలు ఆగిన వెంటనే 19:19:19 లేదా 13:0:45 లేదా యూరియా వంటి పోషకాలను వ్యవసాయ అధికారుల సూచనల మేరకు పంటపై పిచికారీ చేయాలి. అధిక వర్షాలతో విత్తనం మొలకెత్తనప్పుడు లేదా లేత మొక్కలు దెబ్బతిన్నప్పుడు నర్సరీలోనే నారు పెంచుకోవాలి. అంతర సేద్యం చేసి కలుపును తొలగించాలి.
News October 6, 2025
కూరగాయల పంటలపై అధిక వర్షాల ప్రభావం

అధిక వర్షాల వల్ల నీటిలో మునిగిన కూరగాయల పంటల్లో చీడపీడలు, కలుపు బెడద పెరుగుతుంది. టమాటాలో పూతరాలటం, ఎండు తెగులు, ఆకుమచ్చ తెగులు, కాయకుళ్లు సోకే అవకాశం ఉంది. వంగలో ఆకులు పసుపు రంగులోకి మారటం, పూతరాలటం, అక్షింతల పురుగు, బాక్టీరియా మచ్చ తెగులు, కాయకుళ్లు తెగులు సోకే ఛాన్సుంది. మిరపలో ఎండు తెగులు, ఆకుమచ్చ తెగులు కనిపిస్తాయి. తీగజాతి కూరగాయల్లో అక్షింతల పురుగు, పండు ఈగ, బూడిద తెగులు సోకే అవకాశం ఉంది.