News May 24, 2024
16,344 వడదెబ్బ కేసులు.. 60 మరణాలు

ఈ వేసవిలో కొన్నిచోట్ల వర్షాలు పడుతున్నప్పటికీ మరికొన్ని చోట్ల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మార్చి 1 నుంచి ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 16,344 వడదెబ్బ కేసులు నమోదు కాగా.. 60 మంది ప్రాణాలు కోల్పోయారని నేషనల్ సెంటర్ ఆఫ్ డిసీజ్ కంట్రోల్ నివేదిక తెలిపింది. రాజస్థాన్లోని బార్మర్లో గురువారం 48.8డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఏడాది నమోదైన గరిష్ఠ ఉష్ణోగ్రత ఇదే.
Similar News
News November 14, 2025
ఐపీఎల్-2026 మినీ వేలం డేట్ ఫిక్స్!

ఐపీఎల్-2026 మినీ వేలం డిసెంబర్ 16న అబుదాబీలో జరగనున్నట్లు ESPN తెలిపింది. వరుసగా మూడో ఏడాది విదేశాల్లోనే ఆక్షన్ నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఎప్పటిలాగే రోజు మొత్తం వేలం సాగే అవకాశముంది. ఈసారి అన్ని జట్లు పెద్ద మొత్తంలో ప్లేయర్లను వదులుకునే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వేలం ఆసక్తిగా మారనుంది. మరోవైపు పలు జట్లు ఆటగాళ్లను ట్రేడ్ చేసుకుంటున్నాయి.
News November 14, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 14, శుక్రవారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 5.05 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.20 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.01 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.05 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.40 గంటలకు
✒ ఇష: రాత్రి 6.55 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News November 14, 2025
‘జూబ్లీహిల్స్’ ప్రస్థానమిదే..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం 2009లో ఏర్పడింది. ఆ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ విజయం సాధించారు. తెలంగాణ ఏర్పడ్డాక 2014 నుంచి మాగంటి గోపినాథ్(టీడీపీ, బీఆర్ఎస్) వరుసగా మూడు సార్లు గెలిచారు. ఈ ఏడాది జూన్లో ఆయన అనారోగ్యంతో చనిపోగా ఈ నెల 11న ఉపఎన్నిక జరిగింది. ఇవాళ ఓట్ల లెక్కింపు జరగనుంది.


