News October 30, 2024
రాష్ట్రంలో 16,347 ఉద్యోగాలు.. 6న నోటిఫికేషన్!

AP: రాష్ట్రంలో 16,347 పోస్టులతో నవంబర్ 6న మెగా DSC నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 3-4 నెలల్లో నియామక ప్రక్రియ పూర్తిచేసి, వచ్చే విద్యాసంవత్సరానికి పోస్టింగులు ఇచ్చేలా ప్రణాళిక సిద్ధం చేసింది. ఇప్పటికే జిల్లాల వారీగా ఖాళీలు, రోస్టర్ పాయింట్లు, సమాంతర రిజర్వేషన్ల వివరాలను DEOల నుంచి సేకరించింది. మరోవైపు టెట్ తుది కీ నిన్న విడుదల కాగా, 2న ఫలితాలు వెల్లడికానున్నాయి.
Similar News
News November 11, 2025
VER అభివృద్ధికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయండి: చంద్రబాబు

AP: శ్రీకాకుళం నుంచి కోనసీమ వరకు విశాఖ ఎకానమిక్ రీజియన్(VER) అభివృద్ధికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ ప్రాంతాల్లో వచ్చే పెట్టుబడులు, పరిశ్రమలు, ప్రాజెక్టుల కోసం అవసరమైన పాలసీలను రూపొందించాలన్నారు. క్లీన్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి ప్రాజెక్టులపై దృష్టి సారించాలన్నారు. స్టేట్ హెల్త్ కేర్ పాలసీతో మెడికల్ టూరిజంను లింక్ చేయాలని సీఎం తెలిపారు.
News November 11, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News November 11, 2025
ఢిల్లీ పేలుడు.. కారు యజమాని ఎవరంటే?

ఢిల్లీలో ఎర్రకోట వద్ద పేలుడు i20 <<18253113>>కారు<<>>లో జరిగిందని హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. కారు రిజిస్ట్రేషన్ నం. HR26 CE7674 కాగా హరియాణాలోని గురుగ్రామ్లో రిజిస్టర్ అయినట్లు తెలుస్తోంది. యజమాని మహ్మద్ సల్మాన్ను పోలీసులు విచారిస్తున్నారు. పుల్వామాకు చెందిన తారిక్ అనే వ్యక్తికి ఈ కారును అమ్మానని సల్మాన్ పోలీసులకు చెప్పాడని NDTV తెలిపింది. అయితే తారిక్ మరో వ్యక్తికి కారును అమ్మారా అనే విషయం తెలియాలి.


