News January 31, 2025
16,347 టీచర్ పోస్టులు.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

AP: రాష్ట్రంలో రాత్రికి రాత్రే అన్ని కార్యక్రమాలు జరిగిపోతాయని చెప్పట్లేదని CM CBN తెలిపారు. గాడితప్పిన వ్యవస్థలను సరిదిద్దుతున్నామనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. MLC ఎన్నికలు ముగియగానే 16,347 టీచర్ పోస్టులకు DSC నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్రప్రసాద్, పేరాబత్తుల రాజశేఖర్‌లను భారీ మెజార్టీతో గెలిపించాలని కూటమి నేతలకు సూచించారు.
Similar News
News November 24, 2025
చెరకు నరికిన తర్వాత ఆలస్యం చేస్తే..

చెరకు నరికిన తర్వాత రోజులు, గంటలు గడుస్తున్నకొద్దీ గడలలోని సుక్రోజ్ శాతం తగ్గుతుంది. ఈ గడలను గానుగాడించకుండా ఉంచితే.. నిల్వ కాలం పెరిగేకొద్దీ బరువు తగ్గుతుంది. చెరకు నరికిన తర్వాత 24 గంటలు ఆలస్యమైతే 1.5%, 48 గంటలు ఆలస్యమైతే 3%, 72 గంటలు ఆలస్యమైతే 5% వరకు దిగుబడిలో నష్టం జరుగుతుంది. అదే విధంగా రసనాణ్యతలోనూ 0.4%-0.6% వరకు క్షీణత కనిపిస్తుంది. నరికిన చెరకును నీడలో ఉంచితే ఈ నష్టం కొంత తగ్గుతుంది.
News November 24, 2025
పిల్లల ఫొటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారా?

ఇదివరకు పిల్లల ఫొటోలు, వీడియోలు కుటుంబం వరకే పరిమితమయ్యేవి. కానీ సోషల్‌మీడియా వచ్చిన తర్వాత పిల్లలకు సంబంధించిన ప్రతి విషయాన్నీ పేరెంట్స్ ప్రపంచంతో షేర్ చేసుకుంటున్నారు. అయితే ఇది సరికాదంటున్నారు నిపుణులు. పిల్లల ప్రైవసీని కాపాడటం తల్లిదండ్రుల బాధ్యత. పిల్లల ఫొటోలు, వివరాలు షేర్ చేయడం వల్ల మార్ఫింగ్, ఐడెంటిటీ థెఫ్ట్ వంటి ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని సూచిస్తున్నారు.
News November 24, 2025
అమెరికా వీసా రాలేదని..

ట్రంప్ కఠిన వీసా నిబంధనలు తెలుగు డాక్టర్ మరణానికి కారణమయ్యాయి. US వీసా రాలేదని గుంటూరుకు చెందిన డా.రోహిణి HYDలో ఆత్మహత్య చేసుకున్నారు. MBBS చేసిన ఆమె USలో PG చేసేందుకు J1 వీసాకు దరఖాస్తు చేశారు. HYDలోని US కాన్సులేట్‌లో జరిగిన చివరి రౌండ్ ఇంటర్వ్యూలో ‘శాశ్వతంగా USలోనే ఉండిపోవాలనే ఉద్దేశం’ అని కారణాన్ని చూపుతూ రిజెక్ట్ చేశారు. దీంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన రోహిణి సూసైడ్ చేసుకున్నారు.


