News March 20, 2024

100 రోజుల్లోనే రూ.16,400 కోట్ల అప్పు: BRS

image

TG: రేవంత్ రెడ్డి సర్కారు 100 రోజుల్లోనే రూ.16,400 కోట్ల అప్పు చేసిందని BRS విమర్శించింది. ‘తెచ్చిన అప్పులన్నీ ఎక్కడికి పోతున్నయ్? కాంగ్రెస్ ఖజానాలోకా.. లేక రేవంత్ జేబులోకా?’ అని ట్వీట్ చేసింది. ఇన్ని కోట్ల అప్పులు చేసినా పూర్తిస్థాయిలో రైతుబంధు అందజేయలేదని, పెన్షన్లు పెంచలేదని పోస్ట్ చేసింది.

Similar News

News January 28, 2026

కల్కి-2: దీపిక స్థానంలో సాయిపల్లవి!

image

కల్కి-2లో సాయిపల్లవిని తీసుకోవాలనే ఆలోచనలో దర్శకుడు నాగ్ అశ్విన్ ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి. కల్కి 2898 A.Dలో దీపికా పదుకొణె క్యారెక్టర్‌కు భారీ ట్విస్ట్‌తో ముగింపు పలకాలని అనుకుంటున్నారని తెలుస్తోంది. సాయి పల్లవి నేచురల్ యాక్టింగ్‌ సినిమాకు ప్లస్ అవుతుందని డైరెక్టర్ భావిస్తున్నారని టాక్. దీంతో ఈ మూవీపై అంచనాలు మరింత పెరగనున్నాయి. కల్కి-2లో సాయిపల్లవి చేరికపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

News January 28, 2026

మేడారం జాతర.. ఈ నెల 30న ములుగు జిల్లాలో సెలవు

image

TG: మేడారం జాతర సందర్భంగా ఈ నెల 30న ములుగు జిల్లాలో సెలవు ప్రకటిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలతో పాటు విద్యాసంస్థలకు సెలవు వర్తిస్తుందని పేర్కొన్నారు. దీనికి బదులు ఫిబ్రవరి 14 (రెండో శనివారం) పనిదినంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. అటు రాష్ట్రవ్యాప్తంగా సెలవులు ఇవ్వాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.

News January 28, 2026

హైదరాబాద్‌ సీసీఎంబీలో 80 పోస్టులు

image

HYDలోని CSIR-CCMB 80 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గలవారు FEB 23 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, ఐటీఐ/NTC/STC, డిప్లొమా, BE/BTech, BSc/MSc ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష, మెరిట్ లిస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. టెక్నీషియన్‌కు నెలకు రూ.39,545, tech. assist.కు రూ.72,240, tech. ఆఫీసర్‌కు రూ.90,100 చెల్లిస్తారు. వెబ్‌సైట్: www.ccmb.res.in/