News January 12, 2025
టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హత.. రాష్ట్రంలో 1,673 ఉద్యోగాలు

TG: హైకోర్టు పరిధిలో 1,673 ఉద్యోగాలకు ఈ నెల 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జిల్లా కోర్టుల్లో జూనియర్, ఫీల్డ్, రికార్డ్ అసిస్టెంట్ పోస్టులు 1,277, స్టెనోగ్రాఫర్, టైపిస్ట్ వంటి టెక్నికల్ పోస్టులు 184, హైకోర్టులో 212 ఉద్యోగాలున్నాయి. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హత ఉండాలి. ఆన్లైన్ పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. పూర్తి వివరాల కోసం <
Similar News
News December 27, 2025
5 రోజుల్లో 5,000 కిలోమీటర్లు

వలస పక్షుల్లో అముర్ ఫాల్కన్లు (డేగలు) ఎంతో ప్రత్యేకం. మణిపుర్ నుంచి బయలుదేరిన 3 ఫాల్కన్లు (అపపాంగ్, అలాంగ్, అహు) 5 రోజుల్లో 5,000 KMకు పైగా ప్రయాణించి దక్షిణాఫ్రికా చేరుకున్నాయి. వైల్డ్‌లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (WII) నిర్వహించిన శాటిలైట్ ట్రాకింగ్‌లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇవి అరేబియా సముద్రాన్ని దాటి ప్రయాణించాయి. కేవలం 160-200 గ్రాములుండే ఈ పక్షులు రోజుకు 1000KM వరకు ప్రయాణించగలవు.
News December 27, 2025
మాంజా ఎందుకంత డేంజర్? దేనితో తయారు చేస్తారు?

కైట్స్ పోటీల్లో ప్రత్యర్థి పతంగి దారాన్ని కట్ చేయడానికి చైనా మాంజాను షార్ప్‌గా తయారు చేస్తారు. కాటన్ లేదా సింథటిక్ దారానికి కృత్రిమ జిగురు, రంగులు, గ్లాస్ పౌడర్, మెటల్ పౌడర్ కలిపిన పేస్ట్‌ను పూస్తారు. దీన్ని ఎండలో ఆరబెట్టడం వల్ల దారం షార్ప్‌గా మారుతుంది. ఇది మనుషులు, పక్షులకు తీవ్ర ముప్పు తెస్తోంది. అందుకే చాలా ప్రాంతాల్లో దీన్ని బ్యాన్ చేశారు.
News December 27, 2025
ఉపవాసంలో ఉపశమనం కోసం..

ఉపవాస సమయంలో అలసట రాకుండా ఉండాలంటే సగ్గుబియ్యం, పన్నీర్ వంటి ఆహారాలు తీసుకోవడం ఉత్తమం. తాజా పండ్లు, డ్రై ఫ్రూట్స్ సహజ సిద్ధమైన శక్తిని ఇస్తాయి. శరీరంలో నీటి శాతం తగ్గకుండా పాలు, పెరుగు, కొబ్బరి నీళ్లు తీసుకోవడం చాలా అవసరం. తక్కువ ఉప్పు, తక్కువ నూనెతో చేసిన వంటకాలు ఆరోగ్యానికి మంచివి. ఇటువంటి మితమైన, పోషకాలున్న ఆహారం తీసుకోవడం వల్ల శక్తి కోల్పోకుండా ఉపవాసాన్ని విజయవంతంగా పూర్తి చేయవచ్చు.


