News July 1, 2024
BOBలో 168 ఉద్యోగాలు.. రేపే చివరి తేదీ

బ్యాంక్ ఆఫ్ బరోడా(BOB)లో 168 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి రేపటితో గడువు ముగియనుంది. క్రెడిట్ అనలిస్ట్, రిలేషన్షిప్ మేనేజర్, సీనియర్ మేనేజర్ బిజినెస్ ఫైనాన్స్ తదితర పోస్టులున్నాయి. జాబ్ను బట్టి డిగ్రీ, CA/CMA/CS/CFA, పీజీ, డిప్లొమా చేసిన వారు అర్హులు. అలాగే కాంట్రాక్ట్ పద్ధతిలో 459 ఉద్యోగాలున్నాయి. పూర్తి వివరాల కోసం <
Similar News
News October 14, 2025
నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు!

AP: కోస్తాంధ్ర, దక్షిణ తమిళనాడును ఆనుకొని బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనాలు ఏర్పడినట్లు వాతావరణశాఖ తెలిపింది. దీంతో ఇవాళ ఏలూరు, కృష్ణా, NTR, పల్నాడు, GNT జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ అంచనా వేసింది. మిగతా జిల్లాల్లోనూ భారీ వానలు పడే ఛాన్స్ ఉందని వెల్లడించింది. మరో 4 రోజులు కోస్తా, రాయలసీమల్లో ఎక్కువ చోట్ల వర్షాలు, కొన్నిచోట్ల భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని చెప్పింది.
News October 14, 2025
అలాంటి ఫ్రెండ్ ఒక్కరున్నా చాలు!

ఎవరికైనా ఫ్రెండ్స్ అంటే చాలామందే ఉంటారు. కానీ, బెస్ట్ ఫ్రెండ్ అనగానే ఒక్కరిద్దరు మాత్రమే ఉంటారు. మీరు నవ్వితే వాళ్లు నవ్వుతారు, మీరు ఏడిస్తే ఓదారుస్తారు, మీరు గెలిస్తే వాళ్లు సెలబ్రేట్ చేసుకుంటారు, మీకు కష్టమొస్తే వాళ్లు అడ్డంగా నిలబడిపోతారు. ఎవరి లైఫ్లోనైనా అలాంటి ఫ్రెండ్ ఒక్కరున్నా చాలు. మీ జీవితంలో గెలిచారని చెప్పొచ్చు. మరి అలాంటి ట్రూ ఫ్రెండ్ మీ లైఫ్లోనూ ఉన్నారా? కామెంట్ చేయండి.
News October 14, 2025
బత్తాయి, నిమ్మ: OCTలో చేపట్టాల్సిన చర్యలివే..

అక్టోబర్లో బత్తాయి, నిమ్మ తోటల్లో కాయలు ఉన్న చెట్లకు తేలికపాటి తడి ఇవ్వాలి. శిలీంధ్ర వ్యాధుల నుంచి కాపాడుకునేందుకు కాండంపై బోర్డో పేస్టును పూసుకోవాలి. పిందె, కాయలు రాలడాన్ని నివారించడానికి 100గ్రా. కార్బండిజమ్, 1KG యూరియాను 100L నీటిలో కలిపి 15 రోజుల వ్యవధిలో 2సార్లు పిచికారీ చేయాలి. నల్లి నివారణకు నీటిలో కరిగే గంధకాన్ని లీటరు నీటికి 3గ్రా. చొప్పున కలిపి 15 రోజులకోసారి పిచికారీ చేయాలి.