News April 16, 2025
సీఎంను కలిసిన 16వ ఆర్థిక సంఘం బృందం

AP: పనగారియా నేతృత్వంలోని 16వ ఆర్థిక సంఘం ప్రతినిధులు అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిశారు. రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టు వంటి అంశాలపై సీఎం ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి వారికి వివరించారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ప్రత్యేక సాయంపై చర్చించారు. 16వ ఆర్థిక సంఘం బృందం 4 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనుంది.
Similar News
News December 4, 2025
KMR: మరోసారి అవకాశం కల్పిస్తా ఈ సారికి ఆగు..!

పంచాయతీ ఎన్నికల్లో బుజ్జగింపుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే తొలి విడత, రెండవ విడత నామినేషన్ల స్వీకరణ పూర్తి కాగా మూడో విడత కొనసాగుతోంది. ఈసారి తమకు అనుకూలంగా రిజర్వేషన్ రావడంతో ఒకే వర్గానికి చెందిన పలువురు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. దీంతో ఒకరినొకరు బుజ్జగిస్తున్నారు. నామినేషన్లు వెనక్కి తీసుకునేలా ఒత్తిడి చేస్తున్నారు. మరోసారి నీకు అవకాశం కల్పిస్తా ఈసారికి ఆగు అన్నట్లు మాట్లాడుతున్నారు.
News December 4, 2025
తన కన్నా అందంగా ఉండొద్దని.. మేనత్త దారుణం!

కుటుంబంలో తన కన్నా అందంగా ఎవ్వరూ ఉండొద్దని దారుణాలకు పాల్పడిందో మహిళ. ముగ్గురు కోడళ్లు, కొడుకును నీళ్లలో ముంచి హత్య చేసింది. పానిపట్(హరియాణా)లో పెళ్లివేడుకలో విధి(6) టబ్లో పడి చనిపోయింది. పోలీసుల దర్యాప్తులో మేనత్త పూనమ్ హత్య చేసిందని తేలింది. మరో 3హత్యలూ చేసినట్లు పూనమ్ ఒప్పుకుంది. 2023లో ఇషిక(9)ను చంపిన ఆమె తనపై అనుమానం రాకుండా కొడుకు శుభం(3)ను చంపేసింది. ఆగస్టులో జియా(6)ను పొట్టనపెట్టుకుంది.
News December 4, 2025
ఫిబ్రవరిలో పెళ్లి అని ప్రచారం.. స్పందించిన రష్మిక

నటి రష్మిక మందన్న-విజయ్ దేవరకొండ పెళ్లి వార్తలు కొంతకాలంగా వైరల్ అవుతూనే ఉన్నాయి. 2026 ఫిబ్రవరిలో రాజస్థాన్లో పెళ్లి జరుగుతుందనే ప్రచారం జరుగుతోంది. దీనిపై రష్మిక తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ.. ‘వివాహాన్ని నేను ధ్రువీకరించను. అలాగని ఖండించను. సమయం వచ్చినప్పుడు మాట్లాడతా. అంతకుమించి ఏమీ చెప్పను’ అని ప్రశాంతంగా సమాధానం ఇచ్చారు.


