News August 15, 2024
17న ఉపాధ్యాయుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్: డీఈవో

గుంటూరు కార్పొరేషన్ పాఠశాలలలో పనిచేస్తున్న సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులకు సంబందించి సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ కోసం ఈనెల 17వ తేదీన హాజరు కావాలని డీఈవో శైలజ తెలిపారు. ఒరిజినల్ సర్టిఫికెట్స్, సర్వీసు పుస్తకంతో ఉదయం 11 గంటలకు జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయం నందు హాజరు రావాలని సూచించారు. అర్హత కలిగిన ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించడం జరుగుతుందన్నారు.
Similar News
News October 17, 2025
మంగళగిరి: ‘మెడికల్ కాలేజీలపై వైసీపీ తప్పుడు ప్రచారం’

మంగళగిరిలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ రాష్ట్ర అధికార ప్రతినిధులు, ప్యానలిస్టుల కార్యక్రమాన్ని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ప్రారంభించారు. కుల వివక్షతకు వ్యతిరేకంగా తిరుపతి నుంచి సంజీవని స్వరం పేరుతో కార్యక్రమం చేపడతామని మంత్రి తెలిపారు. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలు నిర్మాణానికి చేపట్టిన పీపీపీ విధానంపై వైసీపీ కావాలనే తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు.
News October 17, 2025
వసతి గృహ భవనాల ముఖచిత్రం మారాలి: కలెక్టర్

ప్రభుత్వ భవనాలలో నడుస్తున్న సంక్షేమ వసతి గృహాల ముఖ చిత్రాలు మారాలని కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా అన్నారు. ఇంజనీరింగ్, సంక్షేమ శాఖలతో శుక్రవారం కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ భవనాల్లో ఉన్న 20 సాంఘిక సంక్షేమ, 8 బిసి సంక్షేమ, 3 గిరిజన సంక్షేమ వసతి గృహాలలో సహా అంగన్వాడీ కేంద్రాలలో అవసరమగు మౌలిక సదుపాయాలు గుర్తించాలని నివేదికలు అందజేయాలని ఇంజినీరింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
News October 17, 2025
గుంటూరులో గణనీయంగా తగ్గుతున్న దారిద్ర్యం

గుంటూరు జిల్లా పేదరికం తగ్గుదలపై నీతి ఆయోగ్ నిర్వహించిన జాతీయ బహుముఖ పేదరిక సూచీ (MPI)–2023 సర్వే ప్రకారం, గుంటూరు జిల్లాలో పేదరికం గణనీయంగా తగ్గింది.2015–16లో 8.51% మంది బహుముఖ పేదరికంలో ఉండగా, 2019–21 నాటికి ఇది 4.36%కి పడిపోయింది. ఇది దాదాపు 4.15 శాతం పాయింట్ల మెరుగుదల. విద్య, ఆరోగ్యం, శానిటేషన్ రంగాల్లో పురోగతి ఈ ఫలితాలకు దారితీసింది.
@నేడు అంతర్జాతీయ దారిద్ర్య నిర్మూలన దినోత్సవం