News March 15, 2025
17న చిత్తూరులో జాబ్ మేళా

APSSDC ఆధ్వర్యంలో చిత్తూరులోని జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈ నెల 17న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు జిల్లా ఉపాధి అధికారి జి.పద్మజ తెలిపారు. 3 కంపెనీల ప్రతినిధులు హాజరవుతారన్నారు. పదో తరగతి, ఐటీఐ, ఇంటర్, ఏదైనా డిగ్రీ, ఎంబీఏ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. స్థానిక పరిసర ప్రాంత నిరుద్యోగ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొవాలని సూచించారు. # SHARE IT.
Similar News
News April 25, 2025
షీల్డ్ కవర్లో ఛైర్మన్ అభ్యర్థి పేరు..!

కుప్పం మున్సిపల్ ఛైర్మన్ గిరి కోసం అధికార పార్టీలో పోటీ అధికంగా ఉన్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఛైర్మన్ అభ్యర్థి పేరును షీల్డ్ కవర్లో పంపిస్తారని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఛైర్మన్ గిరి కోసం 20వ వార్డు కౌన్సిలర్ సోము, 19వ వార్డు కౌన్సిలర్ దాముతో పాటు 5వ వార్డు కౌన్సిలర్ సెల్వరాజ్ పోటీపడుతుండగా సీఎం నిర్ణయమే ఫైనల్ కావడంతో ఆ పదవి ఎవరిని వరిస్తుందో అన్న అంశం సస్పెన్స్గా మారింది.
News April 25, 2025
కుప్పంలో మొదలైన క్యాంపు రాజకీయాలు

కుప్పం మున్సిపల్ ఛైర్ పర్సన్ ఎన్నిక ఈనెల 28న జరగనున్న నేపథ్యంలో క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన కౌన్సిలర్లను ఆ పార్టీ నేతలు క్యాంపులకు తరలిస్తున్నారు. ఈ ఎన్నికను టీడీపీ తరఫున ఎమ్మెల్సీ శ్రీకాంత్ పర్యవేక్షిస్తుండగా.. వైసీపీ తరఫున ఎంపీ మిథున్ రెడ్డి రంగంలోకి దిగారు. ఛైర్మన్ సీటు కోసం ఇరు పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి.
News April 25, 2025
చిత్తూరు: రోడ్ల మరమ్మతుకు నిధుల మంజూరు

రోడ్ల మరమ్మతులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని ఆర్అండ్ బీ ఈఈ శ్రీనివాసులు తెలిపారు. చిత్తూరులో ఎంఎస్ఆర్ సర్కిల్ నుంచి పలమనేరు రోడ్డు, ఇరువారం మీదుగా బైపాస్ వరకు 5 కిలోమీటర్ల లేయర్కు రూ.2.50 కోట్లు, పలమనేరు-గుడియాత్తం రోడ్డు(3 కిలోమీటర్లు)కు రూ.1.80 కోట్లు, బైరెడ్డిపల్లె-పుంగనూరు రోడ్డు(6 కిలోమీటర్లు)కు రూ.4.50 కోట్లు విడుదల అయ్యాయి. త్వరలో టెండర్లు పిలవనున్నట్లు ఆయన తెలిపారు.