News December 11, 2024
17న విజయవాడకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

ఈ నెల 17న విజయవాడకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్నట్లు సీఎస్ నీరభ్కుమార్ తెలిపారు. మంగళవారం రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. మంగళగిరి ఎయిమ్స్ మొదటి స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరవుతారన్నారు. ఈనెల 17న ఉదయం 11.20 గంటలకు విజయవాడకు చేరుకొని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మంగళగిరి వెళ్తరని చెప్పారు. మధ్యాహ్నం 12.05 గంటలకు స్నాతకోత్సవంలో పాల్గొననున్నట్లు తెలిపారు.
Similar News
News December 21, 2025
కృష్ణా: మళ్లీ బీసీ వర్గానికి టీడీపీ జిల్లా పీఠం

టీడీపీ కృష్ణా జిల్లా పీఠం మరోసారి BC వర్గాలకే దక్కింది. BC (గౌడ) వర్గానికి చెందిన వీరంకి వెంకట గురుమూర్తిని జిల్లా అధ్యక్షుడిగా నియమితులయ్యారు. గత రెండు పర్యాయాలు కూడా BC వర్గానికి చెందిన బచ్చుల అర్జునుడు, కొనకళ్ల నారాయణరావులే TDP జిల్లా అధ్యక్షులుగా పనిచేసి పార్టీ పటిష్టతకు కృషి చేశారు. గురుమూర్తి నాయకత్వంలో కూడా పార్టీ మరింత బలోపేతం కానుందని పార్టీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
News December 21, 2025
కృష్ణా: మీ పిల్లలకు ఈ చుక్కలు వేయించారా?

కృష్ణా జిల్లాలో ఆదివారం ఉదయమే పల్స్ పోలియో కార్యక్రమం మొదలైంది. ఆరోగ్య కార్యకర్తలు తమకు కేటాయించిన శిబిరాలకు చేరుకున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకు వచ్చి పోలియో చుక్కలు వేయిస్తున్నారు. ఐదేళ్లలోపు చిన్నారులకు ప్రభుత్వ ఆసుపత్రి, బస్టాండ్, మెయిన్ సర్కిళ్ల వద్ద చుక్కలు వేస్తున్నారు. మీ పిల్లలకూ చుక్కలు వేయించారా? లేదా?
News December 21, 2025
బందరు – ప్రయాగ్రాజ్ మధ్య ప్రత్యేక రైలు

పండుగ సీజన్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మచిలీపట్నం – ప్రయాగ్రాజ్ (07401) మధ్య ప్రత్యేక రైలును నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ నెల 22న సాయంత్రం 4:20 గంటలకి మచిలీపట్నంలో బయలుదేరి.. గుడివాడ, విజయవాడ, వరంగల్ మీదుగా మరుసటి రోజు ఉదయం 4:30 గంటలకు గమ్యస్థానం చేరుతుంది. ఇందులో ఏసీ, జనరల్, సెకండ్ క్లాస్ బోగీలు అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు.


