News December 11, 2024
17న HYDకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాక
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది నేపథ్యంలో HYD రానున్న దృష్ట్యా జిల్లాలోని అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్ కోరారు. శీతాకాల విడిది కోసం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి ఈ నెల 17 నుంచి 21వ తేదీ వరకు ఉంటారని వివరించారు. జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియ, మల్కాజిగిరి, కీసర ఆర్డీవోలు శ్యాంప్రకాష్, సైదులు, ఎసీపీ రాములు పాల్గొన్నారు.
Similar News
News January 21, 2025
ఖైరతాబాద్‌లో అక్కినేని నాగ చైతన్య
ఖైరతాబాద్‌లో అక్కినేని నాగ చైతన్య సందడి చేశారు. మంగళవారం తన డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ కోసం ఖైరతాబాద్ ఆర్టీఓ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా రవాణా శాఖ అధికారులు ఆయన వివరాలు తీసుకొని, ప్రక్రియను పూర్తి చేశారు. హీరో రాకతో కార్యాలయం సందడిగా మారింది. పలువురు అధికారులు ఆయనతో ఫొటోలు దిగారు. ఈ ఫొటోలను అక్కినేని ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు.
News January 21, 2025
HYD: రైల్వే ట్రాక్‌పై అమ్మాయి తల, మొండెం (UPDATE)
జామై ఉస్మానియాలో ట్రాక్ మీద అమ్మాయి మృతదేహం కలకలం రేపిన సంగతి తెలిసిందే. కాచిగూడ రైల్వే ఇన్‌స్పెక్టర్ ఎల్లప్ప అక్కడికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతురాలు సిద్దిపేట జిల్లా పెద్ద కోడూరు గ్రామానికి చెందిన భార్గవి(19)గా గుర్తించారు. OU ఆంధ్ర మహిళ సభలోని హాస్టల్‌లో ఉంటూ ఇంటర్ సెకండియర్ చదువుతున్నట్లు వెల్లడించారు. <<15212047>>ఆత్మహత్య<<>>కు గల కారణాలు తెలియాల్సి ఉంది.
News January 21, 2025
HYD: జామై ఉస్మానియా ట్రాక్‌పై అమ్మాయి మృతదేహం
సికింద్రాబాద్ జామై ఉస్మానియా రైల్వే ట్రాక్ మీద అమ్మాయి మృతదేహం కలకలం రేపింది. స్థానికుడు రాజు తెలిపిన వివరాలు.. ‘ఉదయం వాకింగ్‌కు వెళ్లగా రైల్వే ట్రాక్ మీద జనాలు గుమిగూడారు. ఏంటని వెళ్లి చూడగా ఓ అమ్మాయి తల, మొండెం వేరుగా పడి ఉంది. పోలీసులు వచ్చి దర్యాప్తు చేపట్టారు. సదరు యువతి ఓయూలో ఉంటూ ఇంటర్మీడియట్ చదువుతున్నట్లు తెలిసింది.’ అని రాజు పేర్కొన్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.