News April 11, 2025

17లోగా పేర్లు నమోదు చేసుకోవాలి: డీఈవో భిక్షపతి

image

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఈ నెల 19న నిర్వహించే ఉపగ్రహ సాంకేతిక దినోత్సవంలో భాగంగా నిర్వహించే ఆర్యభట్ట స్వర్ణజయంతి ఉత్సవాల్లో పాల్గొనే ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆన్‌లైన్లో ఈ నెల 17లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని డీఈఓ భిక్షపతి తెలిపారు. www.aryabhata.indiaspaceweek.org వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.

Similar News

News April 20, 2025

కార్పొరేట్ కళాశాలల్లో ప్రవేశానికి దరఖాస్తులు

image

కార్పొరేట్ కళాశాలల్లో 2025-26 విద్యా సంవత్సరంలో ప్రవేశానికి ఈ నెల 30లోగా దరఖాస్తు చేసుకోవాలని నల్గొండ సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకుడు ప్రేమ్ కరణ్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఉన్నత ప్రమాణాలతో బోధన సాగిస్తూ కాంపిటిటీవ్ పరీక్షల్లో ఎక్కువ సంఖ్యలో ఉత్తీర్ణత సాధిస్తున్న కళాశాలలకు ఆన్‌లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.

News April 20, 2025

రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల పరిశీలన

image

జిల్లాలో రాజీవ్ వికాసం దరఖాస్తుల పరిశీలన కొనసాగుతుంది. ఈ పథకానికి జిల్లా వ్యాప్తంగా 79,052 దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటికే ఈ దరఖాస్తులను మండల పరిషత్, మున్సిపల్ కార్యాలయాల్లో అధికారులు పరిశీలిస్తున్నారు. ఎస్సీ కార్పొరేషన్‌కు 21,120, ఎస్టీ కార్పొరేషన్‌కు 11,515, బీసీ కార్పొరేషన్‌కు 39,274, ఈ బీసీ 1,994, మైనార్టీకి 4,926, క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్‌కు 253 దరఖాస్తులు వచ్చాయి.

News April 20, 2025

ఒకే కాన్పులో ముగ్గురు జననం

image

సూర్యాపేట మండల పరిధిలోని రాయినిగూడెంకి చెందిన షేక్ షబానాకు మూడు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. సూర్యాపేటలోని ప్రైవేట్ ఆసుపత్రిలో సంతానం కోసం చికిత్స పొంది గర్భం దాల్చారు. ఆమెకు బీపీ, షుగర్, థైరాయిడ్ ఉండటంతో ఆసుపత్రి యజమాన్యం హైరిస్క్ ప్రెగ్నెన్సీగా అడ్మిట్ చేసుకొని సిజేరియన్ చేశారు. ఒకే కాన్పులో ఇద్దరు మగ శిశువులు, ఒక ఆడ శిశువుకు జన్మనిచ్చారు.

error: Content is protected !!